దేశంలో కొరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా విధించిన లాక్ డౌన్ లో ఆకలి భాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఒక కుటుంబం ఫోటో అని సోషల్ మీడియాలో ఒక ఫోటో ప్రచారం కాబడుతుంది. అది ఒక పాత ఫోటో అని FACTLY విశ్లేషణలో తేలింది. అదే ఫోటోను ‘సాక్షి’ దిన పత్రిక వారు జూన్ 2019 లో ప్రచురించారు. ఆ సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. తన భర్త తో ఉన్న కుటుంబ సమస్యల కారణంగా ఫొటోలోని మహిళ తన పిల్లలని చంపి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది అని తెలిసింది.
సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్: https://m.sakshi.com/news/crime/mother-killed-children-and-commits-suicide-karnataka-1199395 https://timesofindia.indiatimes.com/city/hubballi/woman-commits-suicide-after-killing-her-three-children-in-karnataka-village/articleshow/69836711.cms
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?