Fake News, Telugu
 

న్యూ యార్క్ టైమ్స్, టైమ్ మ్యాగజైన్ నరేంద్ర మోదీ గురించి ప్రచురించినట్టు షేర్ చేస్తున్న ఈ ఫోటోలు ఎడిట్ చేయబడినవి

0

కరోనా వైరస్ కారణంగా చనిపోయిన దేశప్రజలకి సంతాపం వ్యక్తం చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురి కావడాన్ని, న్యూయార్క్ టైమ్స్ పత్రిక మొసలి కన్నీటితో పోల్చిందంటూ సోషల్ మీడియాలో ఒక ఫోటో షేర్ అవుతోంది. ‘The New York Times’ న్యూస్ పేపర్ ఎడిషన్ మొదటి పేజి పై ‘India’s PM cried’ అనే టైటిల్ తో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయినట్టు ఈ ఫోటోలో కనిపిస్తుంది. అలాగే, రాక్షస రూపంతో సృష్టించిన నరేంద్ర మోదీ ఫోటోని ‘TIME’ మ్యాగజైన్ మొదటి పేజి పై ప్రచురించినట్టు మరొక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. వారణాసి లోని ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో, కరోనా వైరస్ సోకి మరణించిన దేశప్రజలకి సంతాపం వ్యక్తం చేస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్టుల యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్లని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత ప్రధాని నరేంద్ర మోదీని అవమానిస్తూ న్యూ యార్క్ టైమ్స్, టైమ్ మ్యాగజైన్ పబ్లిష్ చేసిన కథనాల ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోలు ఎడిట్ చేయబడినవి. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కు సంబంధించి షేర్ చేసిన మొదటి ఫోటో, ‘The Daily New York Times’ అనే పేరుతో రూపొందించిన ఒక పేరడీ ట్విట్టర్ హేండిల్ షేర్ చేసింది. ఈ ఫోటోని కేవలం పరిహాసం (సటైర్) కోసం రూపొందించినట్టు వారు స్పష్టం చేసారు. అలాగే, నరేంద్ర మోదీని రాక్షస రూపంలో చూపిస్తున్న మరొక ఫోటో, ‘TIME’ పత్రిక 2019లో ప్రచురించిన నరేంద్ర మోదీ ఫోటోని ఎడిట్ చేసి రూపొందించినట్టు తెలిసింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

కథనం-1:

పోస్టులో షేర్ చేసిన న్యూ యార్క్ టైమ్స్ పత్రిక కథనానికి సంబంధించిన వివరాల కోసం కీ పదాలు ఉపయోగించి గూగుల్ లో వెతికితే, ఈ ఫోటోని ‘The Daily New York Times’ అనే పేరుతో రూపొందించిన పేరడీ ట్విట్టర్ హేండిల్ 21 మే 2021 నాడు షేర్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోని కేవలం పరిహాసం (సటైర్) కోసం రూపొందించినట్టు ఆ ట్విట్టర్ హేండిల్ స్పష్టం చేసింది. ‘The Daily New York Times’ ట్విట్టర్ హేండిల్ తో అమెరికా న్యూస్ సంస్థ ‘The New York Times’ కి ఎటువంటి సంబంధం లేదు.

21 మే 2021 నాడు ‘The New York Times’ ఇంటర్నేషనల్ ఎడిషన్ లో పబ్లిష్ అయిన మొదటి పేజి ని ఇక్కడ చూడవచ్చు. సిరియా దేశంలో సోలార్ విద్యుత్తు ఉపయోగానికి సంబంధించి పబ్లిష్ చేసిన ఆర్టికల్ లోని ఫోటోని ఎడిట్ చేసి, భారత ప్రధాని నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురికావడాన్ని న్యూయార్క్ టైమ్స్ పత్రిక మొసలి కన్నీటితో పోల్చిందంటూ షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఎడిటెడ్ ఫోటో పై స్పష్టతనిస్తూ ‘New York Times Opinion’ స్టాఫ్ ఎడిటర్, బశారత్ పీర్ 22 మే 2021 నాడు ఒక ట్వీట్ పెట్టారు.  ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

కథనం-2:

ఈ ఫోటో కోసం ‘TIME’ పత్రిక వెబ్సైటులో వెతకగా, మే 2019 లో పబ్లిష్ అయిన ‘TIME’ మ్యాగజైన్ లో నరేంద్ర మోదీకి సంబంధించిన ఈ ఫోటోని ప్రచురించినట్టు తెలిసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీని ‘India’s Divider in Chief’ గా పేర్కొంటూ అమెరికా ‘TIME’ పత్రిక ఈ ఫోటోని తమ మ్యాగజైన్ కవర్ పేజీ పై ప్రచురించినట్టు తెలిసింది. నరేంద్ర మోదీకి సంబంధించిన ఈ ఫోటోని ‘TIME’ పత్రిక 10 మే 2019 నాడు తమ ట్విట్టర్ హేండిల్ ద్వారా కూడా షేర్ చేసింది. ‘TIME’ పత్రిక షేర్ చేసిన ఒరిజినల్ ఫోటోలో, నరేంద్ర మోదీ ని రాక్షసుడి రూపంలో చూపించలేదని స్పష్టంగా తెలుస్తుంది.

‘TIME’ మ్యాగజైన్ కవర్ పేజి పై ప్రచురించిన నరేంద్ర మోదీ ఫోటో గురించి భారతీయ న్యూస్ వెబ్సైట్లు పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో ఎడిట్ చేయబడినది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, న్యూ యార్క్ టైమ్స్, టైమ్ మ్యాగజిన్ నరేంద్ర మోదీ గురించి ప్రచురించినట్టు షేర్ చేస్తున్న ఈ కథనాల ఫోటోలు ఎడిట్ చేయబడినవి.

Share.

About Author

Comments are closed.

scroll