Fake News, Telugu
 

కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా సేవలందిస్తూ చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందిస్తోంది, కేవలం ముస్లింలకు మాత్రమే కాదు

0

ఇటీవల ఢిల్లీలో కరోనా సేవలందిస్తూ చనిపోయిన డా. అనాస్ ముజాహిద్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోటి రూపాయల పరిహారం అందించిన నేపథ్యంలో ‘ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా సేవలందిస్తూ మృతి చెందిన వైద్యులలో కేవలం ముస్లిమ్స్ కి మాత్రమే పరిహారం అందిస్తుందని’ చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ‘ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా సేవలందిస్తూ మృతి చెందిన వైద్యులలో కేవలం ముస్లింలకు మాత్రమే పరిహారం అందిస్తుంది’.

ఫాక్ట్ (నిజం): ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఏప్రిల్ 2020లోనే కరోనా సేవలందిస్తూ చనిపోయిన డాక్టర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ మరియు మునిసిపల్ సిబ్బందికి కోటి రూపాయల పరిహారం అందిస్తుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కరోనా సేవలందిస్తూ చనిపోయిన డాక్టర్స్ మరియు హెల్త్ కేర్ వర్కర్స్ అందరికి ఎటువంటి కుల, మత భేదాలు లేకుండా అందిస్తూ వస్తుంది. ఉదాహారణకి కరోనా సేవలందిస్తూ చనిపోయిన టీచర్స్ సియోజీ మిశ్రా, నితిన్ తన్వర్ మరియు డాక్టర్స్ అయిన  జోగిందర్ చౌదరి, అషీమ్ గుప్తా, రాకేశ్ జైన్ మరియు పారిశుధ్య కార్మికుడైన రాజు మొదలైన వారందరి కుటుంబాలకు కేజ్రీవాల్ ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం అందించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఏప్రిల్ 2020లోనే కరోనా సేవలందిస్తూ చనిపోయిన డాక్టర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ మరియు మునిసిపల్ సిబ్బందికి కోటి రూపాయల పరిహారం అందిస్తుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకి కరోనా సేవలందిస్తూ చనిపోయిన డాక్టర్స్ మరియు హెల్త్ కేర్ వర్కర్స్ అందరికి ఎటువంటి కుల, మత బేదాలు లేకుండా అందిస్తూ వస్తోంది. కేవలం ముస్లిమ్స్ కి మాత్రమే కాకుండా కరోనా సేవలందిస్తూ చనిపోయిన అన్ని మతాలకు చెందిన వారికి పరిహారం అందిస్తూ వస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని ఉదాహారణలు కింద చద్దాం.

13 మార్చ్ 2021న ఢిల్లీలోని హిందూ రావు హాస్పిటల్ లో ల్యాబ్ టెక్నీషియన్ గా కరోనా సేవలందిస్తూ చనిపోయిన రాకేశ్ జైన్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోటి రూపాయల పరిహారం అందించారు.

04 ఆగస్టు 2020న కరోనా సేవలందిస్తూ చనిపోయిన డా. జోగిందర్ చౌదరి కుటుంబానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోటి రూపాయల పరిహారం అందించారు.

21 ఆగస్టు 2020న కరోనా సేవలందిస్తూ చనిపోయిన రాజు అనే పారిశుధ్య కార్మికుడి కుటుంబానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కోటి రూపాయల పరిహారం అందించారు.

అదేవిధంగా కేజ్రీవాల్ ప్రభుత్వం పరిహారం అందించిన మరికొన్ని ఉదాహారణలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి ఆధారంగా కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా సేవలందిస్తూ చనిపోయిన ముస్లిమ్స్ కి మాత్రమే పరిహారం అందిస్తుందన్న వాదనలో నిజంలేదని అర్ధమవుతుంది.

ఢిల్లీ ప్రభుత్వం అందించే ఈ కోటి రూపాయల పరిహారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది, ఇందులో కేంద్ర వాటా ఏమి లేదు. ఐతే కేంద్ర ప్రభుత్వం 2020లో ప్రధాన్ మంత్రి గారిబ్ కళ్యాణ్ ప్యాకేజీ (PMGKP) కింద కరోనా సేవలందిస్తున్న ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికి రూ. 50 లక్షల ఇన్సురన్స్ స్కీంని ప్రవేశపెట్టింది, ఈ పథకం ద్వారా కరోనా సేవలందిస్తూ చనిపోయిన ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరి కుటుంబాలకు రూ. 50 లక్షల ఇన్సురన్స్ అందుతుంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఈ స్కీంని మరొక సంవత్సరం పొడిగిస్తూ నిర్ణయం కూడా తీసుకుంది.

చివరగా, కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా సేవలందిస్తూ చనిపోయిన అందరి కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందిస్తూ వస్తుంది, కేవలం ముస్లింలకు మాత్రమే కాదు.

Share.

About Author

Comments are closed.

scroll