ఫోటోలో ఉన్నది ‘నెహ్రు,ఇందిరా, ఇందిరా మామ యూనస్ ఖాన్, మరియు ఇందిరా భర్త ఫిరోజ్ ఖాన్’ అని చెప్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ఫోటోలో ఇందిరా గాంధీ ఎడమ పక్కన ఉన్నది ఇందిరా మామ యూనస్ ఖాన్ మరియు ఇందిరా భర్త ఫిరోజ్ ఖాన్.
ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఇందిరా గాంధీ ఎడమ పక్కన ఉన్నది నికోలస్ రోరిచ్ (రష్యన్ ఆర్టిస్ట్) మరియు యూనస్ ఖాన్ (ఫ్రీడమ్ ఫైటర్). ఇందిరా గాంధీ మామ యూనస్ ఖాన్ కాదు. కావున పోస్ట్ లో చెప్పిందితప్పు.
ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటో ‘alamy’ స్టాక్ వెబ్సైటులో దొరుకుతుంది. ఆ ఫోటోలో ఇందిరా పక్కన ఉన్నది నికోలస్ రోరిచ్ అని వెబ్సైటులో చదవొచ్చు. నికోలస్ రోరిచ్ ఒక రష్యన్ ఆర్టిస్ట్. ఇందిరా గాంధీ యొక్క భర్త తండ్రి పేరు ‘Faredoon Jehangir Ghandy’ అని ‘ది వీక్’ ఆర్టికల్ లో చదవొచ్చు.
ఫోటోలో నికోలస్ రోరిచ్ పక్కన ఉన్నది యూనస్ ఖాన్ అని ‘యూనస్ ఖాన్’ వికీపీడియా వెబ్సైటులో చూడవొచ్చు. అయితే, తను పోస్టులో చెప్పినట్టు ఇందిరా మామ కాదు. యూనస్ ఖాన్ గురించి ఇక్కడ చదవొచ్చు. ఇందిరా భర్త ఫిరోజ్ గాంధీ ఫోటో ఇక్కడ చూడవొచ్చు.
నెహ్రు,ఇందిరా, నికోలస్ రోరిచ్ మరియు యూనస్ ఖాన్ ఉన్న మరో ఫోటోని ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, ఫోటోలో ఇందిరా గాంధీ ఎడమ పక్కన ఉన్నది నికోలస్ రోరిచ్ (రష్యన్ ఆర్టిస్ట్) మరియు యూనస్ ఖాన్ (ఫ్రీడమ్ ఫైటర్).
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?