Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఫేక్ న్యూస్ స్క్రోల్ చేసిన టీవీ9: కొరోనా టీకా వేయించుకున్న ఎలీసా గ్రనటో మృతి చెందలేదు

0

‘కొరోనా టీకా వేయించుకున్న మొదటి మహిళ 32 ఏళ్ల ఎలీసా గ్రనటో మృతి’ అని చెప్తూ టీవీ9 సంస్థ బ్రేకింగ్ న్యూస్ టెలికాస్ట్ చేసింది. దాన్ని చూసి, ప్రజలందరూ సోషల్ మీడియాలో అదే వార్తను షేర్ చేస్తున్నారు. అయితే, అది ఒక ఫేక్ వార్త అని FACTLY విశ్లేషణలో తేలింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న కొరోనా టీకా పరిశోధనలో ఎలీసా గ్రనటో మొదటి వాలంటీర్ గా టీకా తీసుకుంది. ఎలీసా గ్రనటో చనిపోలేదని, ఆరోగ్యంగానే ఉందని, తనతో మాట్లాడిన బీబీసీ జర్నలిస్ట్ ఒకరు ట్వీట్ చేసాడు. అంతేకాదు, ‘నేను బ్రతికే ఉన్నా’ అని ఎలీసా గ్రనటో చెప్తూ తీసిన వీడియోని కూడా తన ట్వీట్ లో పెట్టాడు. యూకే ‘హెల్త్ మరియు సోషల్ కేర్ డిపార్ట్మెంట్’ వారు కూడా అది ఒక ఫేక్ వార్త అని ట్వీట్ చేసారు.

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. బీబీసీ జర్నలిస్ట్ ట్వీట్ – https://twitter.com/BBCFergusWalsh/status/1254356432780214272
2. బీబీసీ జర్నలిస్ట్ ట్వీట్ – https://twitter.com/BBCFergusWalsh/status/1254440535709962245
3. యూకే ‘హెల్త్ మరియు సోషల్ కేర్ డిపార్ట్మెంట్’ ట్వీట్ – https://twitter.com/DHSCgovuk/status/1254406873928908802
4. ఫుల్ ఫ్యాక్ట్ ఆర్టికల్ – https://fullfact.org/online/elisa-granato-fake/

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll