Fake News, Telugu
 

‘ఏలూరు TECU బ్యాంకు వద్ద హనుమంతుడి విగ్రహం ధ్వంసం’ జరిగింది 2014లో, తాజాగా కాదు

0

ఏలూరు అగ్రహారం TECU బ్యాంకు వద్ద ఉన్న హనుమంతుడి మందిరం తలుపులు పగలగొట్టి, హనుమంతుడి విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు’, అని చెప్తూ కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఏలూరు అగ్రహారం TECU బ్యాంకు వద్ద ఉన్న హనుమంతుడి మందిరం దుండగులు ధ్వంసం చేసినట్టు ఫోటోల్లో చూడవొచ్చు.

ఫాక్ట్: ఫోటోల్లోని ఘటన 2014 లో జరిగిందని, ఆ చర్య కి పాల్పడిన వ్యక్తికి 2015 లోనే కోర్టు శిక్ష వేసిందని పశ్చిమ గోదావరి పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదని ఫేక్ న్యూస్ అని, ఈ విషయం పై అసత్య ప్రచారం చేసిన ఒక వ్యక్తి పై కేసు నమోదు చేసినట్టు కూడా పోలీసులు తెలిపారు. పాత ఘటన గురించి ఇప్పుడు పోస్ట్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లో చెప్పిన ఘటన గురించి ఇంటర్నట్ లో వెతకగా, ఈ విషయం పై పశ్చిమ గోదావరి పోలీసులు వివరణ ఇచ్చినట్టు తెలిసింది. ఆంజనేయస్వామి విగ్రహం ధ్వంసం ఘటన 2014 లో ఏలూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని, ఆ చర్య కి పాల్పడిన వ్యక్తికి 2015 లోనే కోర్టు శిక్ష వేసిందని పశ్చిమ గోదావరి పోలీసులు ట్వీట్ చేసారు. ఈ విషయం పై పోలీసులు ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేసారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదని ఫేక్ న్యూస్ అని, ఈ విషయం పై అసత్య ప్రచారం చేసిన ఒక వ్యక్తి పై కేసు నమోదు చేసినట్టు కూడా పోలీసులు తెలిపారు. కేసు ఎఫ్ఐఆర్ ని ఇక్కడ చూడవొచ్చు.

2014 లో జరిగిన ఘటన కి సంబంధించి కోర్టు ఇచ్చిన తీర్పుని ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ‘ఏలూరు TECU బ్యాంకు వద్ద హనుమంతుడి విగ్రహం ధ్వంసం’ అనేది 2014 లో జరిగింది, తాజాగా కాదు.

Share.

About Author

Comments are closed.

scroll