Fake News, Telugu
 

వినియోగదారుల నుండి డబ్బులు ఛార్జ్ చేసే కొత్త పాలసీ ఏదీ వాట్సప్ ప్రవేశపెట్టలేదు

0

మనం తరచూ మెసేజెస్ పంపడానికి వాడుతున్న వాట్సాప్ అప్లికేషన్, ఇప్పుడు తమ వినియోగదారుల నుండి డబ్బులు వసులు చేయబోతుందంటూ ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ మెసేజ్ వాట్సాప్ సంస్థ CEO మరియు డైరెక్టర్ పంపినట్టు పోస్టులో తెలిపారు. అంతేకాదు, ఈ మెసేజ్ ని 20 మందికి ఫార్వర్డ్ చేస్తే, ఫేస్బుక్ “f” సింబల్ కలిగి ఉన్న కొత్త వాట్సాప్ లోగో చూడవచ్చని అంటున్నారు. ఒకవేళ ఈ మెసేజ్ ని ఫార్వర్డ్ చేయకపోతే రేపు సాయంత్రం 6 గంటల తర్వాత వారి అకౌంట్ వాట్సాప్ సర్వర్ నుంచి తొలగించబడుతుందని ఈ పోస్టులో తెలిపారు. వాట్సాప్ కొత్తగా ప్రవేశపెట్టిన ప్రైవసీ పాలసీ కి సంబంధించి వివాదం చోటుచేసుకున్న నేపధ్యంలో, ఈ పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:  వాట్సాప్ లో మెసేజెస్ పంపడానికి వినియోగదారుల నుండి డబ్బులు ఛార్జ్ చేయబోతుంది.

ఫాక్ట్ (నిజం): తమ వినియోగదారుల నుంచి డబ్బులు ఛార్జ్ చేసే కొత్త పాలసీ ఏది వాట్సాప్ తీసుకరాలేదు. వాట్సాప్ వెబ్సైటులో తమ అప్లికేషను నుంచి ఇంటర్నెట్ ఉపయోగించే ఎవరైనా ఉచితంగా మెసేజెస్ పంపుకోవచ్చని తెలిపారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో చేస్తున్న క్లెయిమ్ లకి సంబంధించిన వివరాల కోసం వాట్సాప్ వెబ్సైటులో వెతికితే, వినియోగదారులు మెసేజెస్ పంపడానికి డబ్బులు ఛార్జ్ చేసే పాలసీ ఏది వాట్సాప్ ప్రవేశపెట్టలేదని తెలిసింది. పోస్టులో చెబుతున్న పాలసీ గురించి వాట్సాప్ తమ ట్విట్టర్ అకౌంట్లో ఎక్కడ ట్వీట్ చేయలేదు. వాట్సాప్ వెబ్సైటులో, తమ అప్లికేషను నుంచి ఇంటర్నెట్ ఉపయోగించే ఎవరైనా ఉచితంగా మెసేజెస్ పంపుకోవచ్చని తెలిపారు. ఇదే విషయాన్నీ వాట్సాప్ తమ వెబ్సైటులోని FAQ సెక్షన్ లో పేర్కొంది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న ఇలాంటి ఒక ఫేక్ పోస్టు గురించి వివరిస్తూ వాట్సాప్ తమ బ్లాగ్లో ఆర్టికల్ పబ్లిష్ చేసింది.

వాట్సాప్ ఒకవేళ తమ వినియోగదారుల నుండి డబ్బులు ఛార్జ్ చేసే పాలసీ ప్రవేశపెడితే, పలు మీడియా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసవి. సోషల్ మీడియాలో ఇదే క్లెయిమ్ తో షేర్ చేసిన పాత పోస్టులు మా రీసెర్చ్ లో దొరికాయి. అవి ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. సోషల్ మీడియాలో షేర్ అయిన ఈ పాత పోస్టుల గురించి కొన్ని ఫాక్ట్-చెకింగ్ సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. అవి ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

2019లో ఇదే పోస్టుని, రిలయన్స్ గ్రూప్ చైర్మన్ ముకేష్ అంబానీ వాట్సాప్ అప్లికేషన్ ని 19 బిలియన్ డాలర్లకు కొన్నట్టు, ఇక నుంచి వాట్సప్ యూసర్లు మెసేజెస్ పంపడానికి రిలయన్స్ సంస్థ డబ్బులు ఛార్జ్ చేయనున్నట్టు సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ పోస్టులకి సంబంధించి పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

2014లో ఫేస్బుక్ CEO మార్క్ జూకర్‌బర్గ్ వాట్సాప్ సంస్థని 19 బిలియన్ డాలర్లకి కొన్నారు. వాట్సప్ లోగో పై కొత్తగా ఫేస్బుక్ “f” సింబల్ రానున్నట్టు అధికార సమాచారం లేదు.

చివరగా,  తమ వినియోగదారుల నుండి డబ్బులు ఛార్జ్ చేసే కొత్త పాలసీ ఏది వాట్సాప్ ప్రవేశపెట్టలేదు.

Share.

About Author

Comments are closed.

scroll