Fake News, Telugu
 

వీడియోలోని వ్యక్తి తన కారుకి నిప్పటించుకున్నది పోలీసులు రూ. 35,000 చలానా రాసినందుకు కాదు 

1

ఉత్తర ప్రదేశ్ లోని మథురలో పోలీసులు రూ. 35,000 చలానా రాశారన్న కారణం తో ఒకతను తన కారుకి నిప్పంటించాడని క్లెయిమ్ చేస్తూ ఒక  పోస్ట్ లోని వీడియో సోషల్ మీడియా లో ప్రచారం కాబడుతోంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజం ఉందో కనుక్కుందాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పోలీసులు రూ. 35,000 చలాను విధించడంతో ఒకతను తన కారుకి నిప్పంటిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): ఆ వీడియో లో ఉన్న అతని పేరు శుభం చౌదరి, స్త్రీ పేరు అంజుల శర్మ. వాళ్లిద్దరూ తమ వివాహాన్ని ప్రకటించేటప్పుడు  మీడియా కవరేజ్  ఉండాలనే ఉద్దేశం తో తమ కారుకి నిప్పటించారు. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ అబద్ధం.     

పోస్ట్ లోని వీడియో లో ఉన్న’ABP గంగ’ లోగోని ఉపయోగించి YouTube లో వెతికితే,  సెప్టెంబర్ 25, 2019 న ప్రసారం చేయబడిన ఆ న్యూస్ వీడియో కనిపించింది. ఆ వీడియో లో రిపోర్టర్ చెప్తున్న దాని బట్టి ఆ సంఘటన మథుర లో జరిగినట్టు తెలుస్తుంది. కానీ, ఇతర ఏ వివరాలు ఆ వీడియో లో లభించలేదు. ఆ వివరాల కోసం గూగుల్ లో ‘మథుర  కారుని  నిప్పటించిన సంఘటన’ అనే కీవర్డ్స్ తో వెతికితే ‘News18’ వారు  ప్రచురించిన ఒక ఆర్టికల్ కనిపించింది. దాని కథనం ప్రకారం, శుభం చౌదరి, అంజుల శర్మ అనే ఇద్దరు తమ వివాహాన్ని ప్రకటించేటప్పుడు మీడియా కవరేజ్ కావాలనే  ఉద్దేశం తో తమ కారుకి నడిరోడ్డు మీద నిప్పటించారని, అందుకు గాను మథుర పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసారని  తెలుస్తుంది.

కానీ, పోలీసులు చలాను వేసినందుకు వాళ్ళు తమ కారుకి నిప్పటించుకున్నారు అని సోషల్ మీడియా లో తప్పుగా ప్రచారం జరుగుతుండడం తో మథుర పోలీసులు ఆ క్లెయిమ్ తప్పు అని, అందులో ఎటువంటి నిజం లేదు అని స్ఫష్టం చేసారు

చివరగా, అతను తన కారుకి నిప్పంటించింది పోలీసులు తనకి రూ. 35,000 చలానా వేసినందుకు కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll