Fake News, Telugu
 

ఆర్టీసీ సమ్మె మరియు పాఠశాలల సెలవుల గురించి అడిగినందుకు వీడియోలో బాల్క సుమన్ కొట్టలేదు. అది ఒక పాత వీడియో.

3

పిల్లల చదువులకు, ఆర్టీసీ సమ్మెకు అసలు సంబంధం ఏమిటి? పాఠశాలలకు ఎందుకు సెలవు ప్రకటించారు?’ అని ఒక విద్యార్థి తండ్రి అడిగినందుకు టీవీ లైవ్ లో అతన్ని ఎం.ఎల్.ఏ బాల్క సుమన్ కొట్టాడని ఒక వీడియోతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆర్టీసీ సమ్మె వల్ల విద్యార్థులకు ఇస్తున్న సెలవుల గురించి అడిగిన ఒక విద్యార్థి తండ్రిని కొట్టిన ఎం.ఎల్.ఏ బాల్క సుమన్.    

ఫాక్ట్ (నిజం): అది ఒక పాత వీడియో. తెలంగాణా అమరవీరుల కుటుంబాలకి సహాయం చేయాలంటూ అడుగుతున్న ఒక వ్యక్తిని బాల్క సుమన్ కొట్టాడు. ఆర్టీసీ సమ్మెకుగానీ, విద్యార్థుల చదువులకు గానీ పోస్ట్ లోని వీడియోకి సంబంధం లేదు. కావున పోస్ట్లో చెప్పింది తప్పు.   

పోస్ట్ లోని వీడియో గురించి గూగుల్ లో ‘Balka Suman beats on TV’ అని వెతకగా, 2014 లో ‘NTV’ వారు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ వీడియోలో తెలంగాణా అమరవీరుల కుటుంబాలకు తగిన సహాయం అందలేదని మాట్లాడుతున్న ఒక వ్యక్తిని బాల్క సుమన్ కొట్టినట్టు చూడవొచ్చు.  పోస్ట్ లోని వీడియోనే యూట్యూబ్ లో  ‘India TV’ వారు 2010 లోనే అప్లోడ్ చేసినట్టు చూడవొచ్చు. ఈ ఘటన గురించి ‘India TV’ మరియు ‘Outlook’ వారు రాసిన ఆర్టికల్స్ ని ఇక్కడ మరియు ఇక్కడ చదవొచ్చు.

చివరగా, ఆర్టీసీ సమ్మె మరియు పాఠశాలల సెలవుల గురించి అడిగినందుకు వీడియోలో బాల్క సుమన్ కొట్టలేదు. అది ఒక పాత వీడియో.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll