నరేంద్ర మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ మరియు నిత్యావసర సరుకుల ధరలని పెంచుతున్న విధానాన్ని చూసి ఆగ్రహం చెందిన కొందరు మహిళలు బీజేపీ ఎమ్మెల్యేని చెప్పులతో కొడుతున్న దృశ్యాలు, అంటూ రెండు ఫోటోలతో కూడిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: నరేంద్ర మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ మరియు నిత్యావసర సరుకుల ధరలని పెంచుతున్నారన్న కోపంతో కొందరు మహిళలు ఒక బీజేపీ ఎమ్మెల్యేని చెప్పులతో దాడి చేస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలలో కనిపిస్తున్న ఘటన 2018లో ఉత్తరప్రదేశ్ రాష్రంలోని అమ్రోహ జిల్లాలో జరిగింది. అమ్రోహ జిల్లా పాటై ఖాల్స గ్రామనికి చెందిన బీజేపీ మహిళా కార్యకర్తలు, తమ గ్రామంలో రేషన్ సరఫరా పై జరుగుతున్న అక్రమాలని మంత్రులకు వివరించేందుకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేసినప్పుడు ఈ ఘటన జరిగింది. మదన్ వర్మ అనే బీజేపీ నేత, ఆ గ్రామ రేషన్ డీలర్ కి మద్దతు పలుకుతూ మాట్లాడినందుకు, బీజేపీ మహిళా కార్యకర్తలు ఆగ్రహంతో అతని పై ఇలా దాడి చేసారు. మదన్ వర్మ బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఈ ఫోటోలు ఇటీవల తీసినవి కావు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన ఫోటోలని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే ఫోటోలని షేర్ చేస్తూ ‘GAJRAULA TIMES’ న్యూస్ వెబ్సైటు 05 జూన్ 2018 నాడు ఆర్టికల్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోలలో కనిపిస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్ రాష్రంలోని అమ్రోహ జిల్లాలో చోటుచేసుకున్నట్టు ఆర్టికల్ లో తెలిపారు. అమ్రోహ జిల్లా పాటై ఖాల్స గ్రామనికి చెందిన బీజేపీ మహిళా కార్యకర్తలు, తమ గ్రామంలో రేషన్ సరఫరా పై జరుగుతున్న అక్రమాలని మంత్రులకు వివరించేందుకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా చేసినట్టు ఈ ఆర్టికల్ లో వివరించారు. రేషన్ లాభాలు పొందడానికి తమని ఐదు వందల రూపాయలు కట్టమంటున్నారని మహిళలు ఆరోపించినట్టు ఇందులో తెలిపారు. ధర్నా చేస్తున్న మహిళలకు సర్ధిచెప్పడానికి వచ్చిన బీజేపీ నేత మదన్ వర్మ, ఆ గ్రామ రేషన్ డీలర్ కి మద్దతు పలుకుతూ మాట్లడడంతో, బీజేపీ మహిళా కార్యకర్తలు ఆగ్రహంతో అతని పై చెప్పులతో దాడి చేస్తూ అతని చొక్కా చింపినట్టు ఈ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసారు.
ఈ ఘటనకి సంబంధించి వివరాలని రిపోర్ట్ చేస్తూ ‘News 18 India’ న్యూస్ వెబ్సైటు 05 జూన్ 2018 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియోని పబ్లిష్ చేసింది. బీజేపీ నేత మదన్ వర్మ పై అమ్రోహ జిల్లా మహిళలు దాడి చేస్తున్న దృశ్యాలని తమ వీడియోలో తెలిపారు. ఈ ఘటనకి సంబంధించి 2018లో పబ్లిష్ అయిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలు పాతవి అని ఖచ్చితంగా చెప్పవచ్చు.
చివరగా, 2018లో రేషన్ అక్రమాలకి వ్యతిరేకంగా జరిగిన ధర్నాకి సంబంధించిన ఫోటోలని నిత్యావసర సరుకుల ధరలని పెంచుతున్నారన్న కోపంతో మహిళలు బీజేపీ ఎమ్మెల్యే పై దాడి చేస్తున్న దృశ్యాలని షేర్ చేస్తున్నారు.