Fake News, Telugu
 

ఈ వీడియోలో చూపిస్తున్నట్టు రావి చెట్టుకి మామిడికాయలు కాసాయన్నది అబద్ధం

0

రావిచెట్టు కొమ్మకు మామిడి కాయ వేలాడుతూ కనిపిస్తున్న వీడియోని షేర్ చేస్తూ ‘ఋషికేష్ లో రావిచెట్టుకు మామిడి కాయలు కాశాయి’  అని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఇదే వీడియోని ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ABN కూడా ప్రసారం చేసింది.  ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఋషికేష్ లో రావిచెట్టుకు మామిడి కాయలు కాసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఇటీవల ఋషికేష్ లో తుఫాను వల్ల బలమైన గాలులు వీయడంతో వీడియోలో కనిపిస్తున్న రావి చెట్టుకి దగ్గరిలోని మామిడి చెట్టు యొక్క చిన్న కొమ్మలు విరిగి, గాలికి ఎగిరి రావి చెట్టు పైన పడ్డాయి. దీనిని కొందరు వీడియో తీసి రావి చెట్టుకి మామిడి కాయలు కాసినట్టు ప్రచారం చేసారు. ఇదే విషయాన్ని కొన్ని వార్త కథనాలు ప్రచురించాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోలో చూపిస్తున్నట్టు రావిచెట్టుకు మామిడి కాయలు కాయలేదు. ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్ లో వేతకగా, ఈ వీడియోపై వివరణ ఇస్తూ ఆజ్ తక్ రాసిన ఒక కథనం మాకు కనిపించింది. వీడియోలో కనిపిస్తున్న హోర్డింగ్స్ పై ఉన్న మొబైల్ నెంబర్ల ఆధారంగా ఆజ్ తక్ అక్కడి వారిని సంప్రదించి రాసిన ఈ కథనం ప్రకారం, ఇటీవల ఋషికేష్ లో తుఫాను వల్ల బలమైన గాలులు వీయడంతో వీడియోలో కనిపిస్తున్న రావి చెట్టుకి దగ్గరిలోని మామిడి చెట్టు యొక్క చిన్న కొమ్మలు విరిగి రావి చెట్టు పైన పడ్డాయి. పోస్టులోని వీడియోలో కనిపిస్తున్న మామిడి కాయ కూడా అలా గాలికి పడిందే.

అక్కడి పోలీస్ ని సంప్రదించినప్పుడు, వారు కూడా రావిచెట్టుకు మామిడి కాయలు కాయలేదని, ఇటీవల వీచిన బలమైన గాలులకు పక్కనున్న మామిడి చెట్టు కొమ్మలు విరిగి ఇలా రావి చెట్టుపైన పడ్డాయని స్పష్టం చేసారు. దినినే కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసారని వారు తెలిపారు. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు రావి చెట్టకి మామిడి కాయలు కాయలేదని చెప్తూ దైనిక్ భాస్కర్ రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు.

చివరగా, ఈ వీడియోలో చూపిస్తున్నట్టు రావి చెట్టుకి మామిడికాయలు కాసాయన్నది తప్పు.

Share.

About Author

Comments are closed.

scroll