Fake News, Telugu
 

‘రైతుల వేషం వేసుకొని కెమెరాతో షూటింగ్’ అని పెట్టినవి తాజా ఢిల్లీ రైతుల నిరసనకి సంబంధించిన ఫోటోలు కావు

0

రైతులు కానీ రైతుల గ్రేట్ ఇండియన్ తమాషా! షూటింగ్ అయిపోయాక పోస్ట్ ప్రొడక్షన్ వర్క్. ఇదీ ఢిల్లీ లో రైతుల ఆందోళన వెనుక నడుస్తున్న దేశ ద్రోహుల కుట్రలు’, అని చెప్తూ, కొన్ని ఫోటోలను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఢిల్లీ రైతుల ఆందోళన లో రైతుల వేషం వేసుకొని కెమెరాతో షూటింగ్ చేస్తున్న ఫోటోలు.

ఫాక్ట్: పోస్ట్ లో ఉన్నవి తాజాగా ఢిల్లీ లో జరుగుతున్న రైతుల ఆందోళన కి సంబంధించిన ఫోటోలు కాదు. మొదటి ఫోటో రాహుల్ గాంధీ తమిళనాడు రైతులను మార్చి 2017 లో ఢిల్లీ జంతర్ మంతర్ లో కలిసినప్పుడు తీసినది. మిగితా ఫోటోలు కూడా 2017 నుండి ఇంటర్నెట్ లో షేర్ చేయబడుతున్నాయి. కావున, పాత ఫోటోలను షేర్ చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ లోని మొదటి ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే ఫోటోని 2017 లో ప్రచురించబడిన ఒక ఆర్టికల్ లో చూడవొచ్చు. అది రాహుల్ గాంధీ తమిళనాడు రైతులను మార్చి 2017 లో ఢిల్లీ జంతర్ మంతర్ లో కలిసినప్పుడు తీసిన ఫోటో అని తెలుస్తుంది. 31 మార్చి 2017 న రాహుల్ గాంధీ  రైతులను కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు యూట్యూబ్ లో పెట్టిన లైవ్  వీడియోని ఇక్కడ చూడవొచ్చు.

పోస్ట్ లోని మిగితా రెండు ఫోటోలు 2017 నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నట్టు తెలిసింది. తమిళనాడు బీజేపీ లీడర్ ఒకరు అవే ఫోటోలను ఏప్రిల్ 2017 లో పోస్ట్ చేసి, ఇండియా టుడే సంస్థ వారు రైతులను ఫోటోషూట్ కోసం తమిళనాడు నుండి నోయిడా కి తీసుకొని వెళ్లారు అని రాసాడు. ఆ ఫోటోల గురించి ఎటువంటి కచ్చితమైన సమాచారం దొరకలేదు. ఆ ఫోటోలు కొత్త వ్యవసాయ చట్టాలు ఆమోదించక ముందు నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతున్నందున, ఆ ఫోటోలు తాజాగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళన కి సంబంధించినవి కావని చెప్పవొచ్చు.

చివరగా, పోస్ట్ చేసినవి తాజాగా ఢిల్లీ లో జరుగుతున్న  రైతుల ఆందోళన కి సంబంధించిన ఫోటోలు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll