Fake News, Telugu
 

హైదరాబాద్ మెట్రోకు సంబంధించి సైన్ బోర్డులు, రూట్ మ్యాప్ మరియు ఇతర సమాచారాన్ని మొత్తం నాలుగు భాషల్లో ఏర్పాటు చేశారు

0

హైదరాబాద్ మెట్రోలో రూట్ మ్యాప్ మొత్తం కేవలం ఉర్దూ మరియు ఇంగ్లీష్‌లోనే ఉంటాయని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. మెట్రోలో అసలు రూట్ మ్యాప్ తెలుగులో లేనట్టు పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్నదానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: హైదరాబాద్ మెట్రోలో రూట్ మ్యాప్ మొత్తం కేవలం ఉర్దూ మరియు ఇంగ్లీష్‌లోనే ఉంటుంది.

ఫాక్ట్ (నిజం): హైదరాబాద్ మెట్రో సంస్థ మెట్రోకు సంబంధించి సైన్ బోర్డులు, రూట్ మ్యాప్ మరియు ఇతర సమాచారాన్ని మొత్తం నాలుగు భాషల్లో ఏర్పాటు చేసింది. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మరియు హిందీ భాషల్లో ఈ సమాచారాన్ని ఏర్పాటు చేసారు. ట్రైన్‌ లోపల ఉండే స్క్రీన్‌పై కూడా రూట్ మ్యాప్ మరియు ఇతర సమాచారం ఈ నాలుగు భాషలలో ఉంటుంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

హైదరాబాద్ మెట్రో సంస్థ మెట్రోకు సంబంధించి సైన్ బోర్డులు మరియు రూట్ మ్యాప్ కేవలం ఉర్దూ మరియు ఇంగ్లీష్‌లో మాత్రమే కాకుండా మొత్తం నాలుగు భాషల్లో ఏర్పాటు చేసారు.

తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మరియు హిందీ భాషల్లో సైన్ బోర్డులు మరియు రూట్ మ్యాప్‌లు ఏర్పాటు చేసారు. ఇదే విషయం హైదరాబాద్ మెట్రో కూడా స్పష్టం చేసింది (ఇక్కడ మరియు ఇక్కడ). దీనికి సంబంధించిన వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు.

పైగా ట్రైన్‌ లోపల ఉండే స్క్రీన్‌పై కూడా రూట్ మ్యాప్ మరియు ఇతర సమాచారం పైన తెలిపిన నాలుగు భాషల్లో ఉంటుంది. దీనికి సంబంధించి మేము తీసిన వీడియో ఇక్కడ చూడొచ్చు. దీన్నిబట్టి హైదరాబాద్ మెట్రోలో కేవలం ఉర్దూ మరియు ఇంగ్లీష్ భాషలే ఉపయోగించారన్న వాదన కరెక్ట్ కాదని స్పష్టమవుతుంది.

చివరగా, హైదరాబాద్ మెట్రోకు సంబంధించి సైన్ బోర్డులు, రూట్ మ్యాప్ మరియు ఇతర సమాచారాన్ని మొత్తం నాలుగు భాషల్లో ఏర్పాటు చేశారు.

Share.

About Author

Comments are closed.

scroll