Fake News, Telugu
 

ఫోటో లో కనిపించే ‘మహిళ ఆకారంలోని పువ్వు’ ఉన్నట్లుగా ఎటువంటి ఆధారాలూ లేవు

1

ఫేస్బుక్ లో ఒక ఫోటో ని పెట్టి, ‘ఇది ఒక మహిళ ఆకారంలో ఉన్న ఒక పుష్పం, ఇది కేవలం 20 సంవత్సరాలలో ఒక్కసారి వికసిస్తుంది. ఈ పుష్పం కేరళ, పాలక్కాడు, అబ్బాల్హాబారా విల్లజ్.ఐట్ లో కనిపిస్తుంది, ఇది భగవంతుని యొక్క అద్భుతమైన సృష్టి. ఇది ప్రపంచంలోని గొప్పవింత. దయచేసి మీ అన్ని గ్రూప్ లకు పంపండి’ అని ప్రచారం చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : మహిళ ఆకారంలో ఉన్న పువ్వు ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఫోటో లో కనిపించే మహిళ ఆకారంలోని పువ్వు ఉన్నట్లుగా ఎటువంటి ఆధారాలూ లేవు . కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.   

పోస్ట్ లోని ఫోటోని క్రాప్ చేసి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అందులో ఉన్నది పువ్వు అని కొంతమంది, ఇంకొంతమంది అది ఒక ఫలం అని గత కొంత కాలంగా ఆరోపిస్తున్నట్లుగా తెలిసింది. ఇంటర్నెట్ లో వేరు వేరు చోట్ల అలాంటి పువ్వుని ‘నారీలతా ఫ్లవర్’ అని సంభోదిస్తున్నారు. నిజంగా ఫొటోలో కనిపించే ఆకారంలో ‘నారీలతా ఫ్లవర్’ ఉందా అని వెతికినప్పుడు, ఆ విషయాన్ని ధృవీకరిస్తూ ఎటువంటి సమాచారం కూడా లభించలేదు. అలాంటి పువ్వు కి సంబంధించిన వార్త కనీసం 2009 నుండి ప్రచారం లో ఉంది. ఒక వేల అది నిజంగానే ఉంటే, దానిని వృక్షశాస్త్రజ్ఞులు ఇప్పటివరకే గమనించే వారు మరియు అందుకు సంబంధించిన సమాచారం కూడా ‘నేచర్ జర్నల్స్’ లో వచ్చి ఉండేది. కానీ, అలాంటిదేమీ జరగలేదు.

ఫొటోలో కనిపించే ఆకారంలో పువ్వు కానీ, ఫలం కానీ లేదు అని చెప్పడానికి గల మరికొన్ని కారణాలు:

  1. అలాంటి ఒక పువ్వుకి గానీ, ఫలం కి గానీ సంబంధించిన చెట్టు ఉన్నట్లయితే, ఇప్పటికే అనేక వార్తా సంస్థలు, రీసర్చర్లు ఆ చెట్లు పెరిగే ప్రాంతానికి వెళ్లి, దాని ఫోటోలు తీసి కథనాలు ప్రచురించేవారు. కానీ, అలాంటిదేమీ ఇప్పటివరకు జరగలేదు.
  2. అలాంటి పూలు లేదా పండ్లు పెరిగే ప్రాంతం ఒక వేల ఉండి ఉంటే, అది పర్యాటకులను ఆకర్షించి ఒక పర్యాటక కేంద్రంగా మారి ఉండేది. కానీ, అలా కూడా జరగలేదు.
  3. పోస్టులోని ఫోటోలో కనిపించేది పువ్వు లేదా ఫలం అని పేర్కొంటూ అవి థాయిలాండ్ లో, శ్రీలంక లో మాత్రమే పెరుగుతాయి అని కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ, ఆ విషయాన్ని ధ్రువీకరిస్తూ అక్కడి ప్రముఖ వార్తా సంస్థలు ఎటువంటి కథనం ప్రచురించలేదు.

ఇదే విషయాన్ని వెల్లడిస్తూ ‘Snopes’ వారు ప్రచురించిన కథనాన్ని ఇక్కడ చదవవచ్చు.

చివరగా, ఫోటో లో కనిపించే ‘మహిళ ఆకారంలోని పువ్వు’ ఉన్నట్లుగా ఎటువంటి ఆధారాలూ లేవు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll