Fake News, Telugu
 

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు అంజలి బిర్లా అనీష్ రజానీ అనే సింధీ హిందువును వివాహం చేసుకున్నారు, ముస్లిం వ్యక్తిని కాదు

0

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు అంజలి బిర్లా కోటాలో వ్యాపార కుటుంబానికి చెందిన అనీసుర్ రెహమాన్ అనే ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారని సోషల్ మీడియాలో (ఇక్కడ మరియు ఇక్కడ) ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

పోస్ట్ యొక్క ఆర్కైవ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు, అంజలి బిర్లా, అనీసుర్ రెహమాన్ అనే ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకున్నారు.

ఫాక్ట్(నిజం): లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు అంజలి బిర్లా 12 నవంబర్ 2024న సింధీ హిందూ మతానికి చెందిన అనీష్ రజానీని వివాహం చేసుకున్నారు. అనేక వార్తా కథనాలు దీనిని ధృవీకరించాయి. ఇదే విషయంపై, మాజీ  గయా MP మరియు భారతీయ జనతా పార్టీ సభ్యుడు హరి మాంఝీ కూడా Xలో పుకార్లను ఖండించారు. అతను వారి వివాహ ఆహ్వాన పత్రికను షేర్ చేశారు. కాబట్టి, పోస్ట్‌లో చేసిన దావా తప్పు .

ఈ దావాను ధృవీకరించడానికి, మేము గూగుల్ కీవర్డ్స్ ఉపయోగించి వెతికాము. ఇది 13 నవంబర్ 2024 నాటి వార్తా కథనాలకు (ఇక్కడ మరియు ఇక్కడ ) దారి తీసింది. ఈ కథనాలు ప్రకారం, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు, అంజలీ బిర్లా, వ్యాపారవేత్త అనీష్ రజానీని 12 నవంబర్ 2024న వివాహం చేసుకున్నారు. అనీష్ సింధీ వ్యాపార కుటుంబానికి చెందినవాడు, ప్రస్తుతం తన కుటుంబ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో నిమగ్నమై ఉన్నాడు.

మా పరిశోధనలో, అంజలీ బిర్లా వివాహం గురించిన పుకార్లను స్పష్టం చేస్తూ మాజీ గయా MP, భారతీయ జనతా పార్టీ సభ్యుడు హరి మాంఝీ X ప్లాట్ఫాంలో 13 నవంబర్ 2024న చేసిన ట్వీట్‌ను మేము కనుగొన్నాము. అంజలి బిర్లా భర్త అనీష్ రజానీ కోటాలో పేరున్న వ్యాపార కుటుంబానికి చెందిన సింధీ హిందువు అని ధృవీకరించడంతో పాటు, వారి వివాహ ఆహ్వాన పత్రికను కూడా షేర్ చేశారు.

ఇంతకుముందు అంజలి బిర్లా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) రాయకుండానే IAS కి ఎంపికయ్యారని దావాను Factly ఫ్యాక్ట్-చెక్ చేసింది. 

చివరిగా, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూతురు అంజలి బిర్లా అనీష్ రజానీ అనే సింధీ హిందువును వివాహం చేసుకున్నారు, ముస్లిం వ్యక్తిని కాదు.

Share.

About Author

Comments are closed.

scroll