Coronavirus Telugu, Fake News, Telugu
 

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎటువంటి భారత విద్యార్థి యొక్క సహజ కోవిడ్-19 నివారణను అంగీకరించలేదు

0

పాండిచ్చేరి విశ్వవిద్యాలయానికి చెందిన ఒక భారతీయ విద్యార్థి కోవిడ్-19కు సహజ నివారణ కనుగొన్నాడని, ఇది మొదటిసారి WHO చేత అంగీకరించబడిందని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల తేనె, కొంత అల్లం రసమును వరుసగా ఐదు రోజులు పాలలో కలిపి సేవించడం ద్వారా కరోనా ప్రభావాలను అణిచివేస్తుందని ఆ పోస్ట్ లో ఉన్నది. ఆ పోస్ట్ లో ఎంత వరకు నిజం ఉందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:  ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక భారత విద్యార్థి కనుగొన్న సహజ కోవిడ్-19 నివారణను మొదటిసారి అంగీకరించింది.

ఫాక్ట్: ఒక భారతీయ విద్యార్థి కోవిడ్-19కు సహజ నివారణ కనుగొన్నాడని, ఇది మొదటిసారి WHO చేత అంగీకరించబడిందని వస్తున్న కధానాలల్లో నిజం లేదు. వాక్సిన్లు తప్పించి కోవిడ్-19 ను నివారించటానికి ఇప్పటి వరకు ఎటువంటి మందులు కనుగొనలేదు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెబ్ సైట్ లో స్పష్టంగా తెలియజేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఈ పోస్ట్ లో ఎంత నిజం ఉన్నది అని మేము వెతికినప్పుడు, ఎటువంటి న్యూస్ రిపోర్ట్ లో కూడా పాండిచ్చేరి విశ్వవిద్యాలయం నుండి భారత విద్యార్థి యొక్క సహజ కోవిడ్-19 నివారణ గురించి నిర్ధారణ లేదు. ఒకవేళ ఇటువంటి సహజ నివారణ WHO ఆమోదం పొంది ఉంటే, అన్ని వార్త పత్రికలూ దీని గురుంచి రాసేవి. కాకపోతే, అటువంటి రిపోర్టులు ఏవీ మాకు దొరకలేదు.

పోస్ట్ లో చెప్పిన సహజ నివారణ గురించి వెతికినప్పుడు, చాలా న్యూస్ రిపోర్ట్స్ ఆ మిశ్రమం (తేనె + నల్ల మిరియాలు + అల్లం) దగ్గు, జలుబు ఎదుర్కొనడానికి, శరీరం యొక్క రోగ నిరోధక శక్తి ని పెంపొందించడానికి బాగా ఉపయోగపడతాయి అనిచెప్పాయి. ఆ రిపోర్ట్స్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కానీ, వీటిలో ఎక్కడా కూడా కోవిడ్-19 ను నివారించగలం అని రాసి లేదు.

ఇటువంటి మరెన్నో తప్పుడు సమాచారాల గురుంచి ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తన మిత్ బస్టర్స్ వెబ్ పేజీ లోస్పష్టత ఇచ్చింది. అదే పేజీ లో హాట్ పెప్పెర్స్ (మిరియాలు) మన ఆహారంలో ఉన్నాగానీ, అవి కోవిడ్-19 ను నివారించవు అని చెప్పింది. పై పోస్ట్ లో నల్ల మిరియాల గురించి కూడా ప్రస్తావన ఉంది.

అదే మిత్ బస్టర్స్ సెక్షన్లో, కోవిడ్-19 నివారించుటకు ఎటువంటి మందులు లేవు అని కూడా WHO చెప్పింది.

చివరగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఎటువంటి భారత విద్యార్థి యొక్క సహజ కోవిడ్-19 నివారణను అంగీకరించలేదు.

Share.

About Author

Comments are closed.

scroll