Fake News, Telugu
 

ఫోటోలో ఉన్న జీవి చెక్కడం వల్ల సాలగ్రామాలు ఏర్పడవు; అవి అంతరించిన జీవుల శిలాజాలతో ఏర్పడుతాయి

0

“ఈ కీటకాన్ని ఎవరు గుర్తించలేదు కదా, దీన్ని “వజ్రకీట” అంటారు. ఇది చూడడానికి ముళ్ళతో భయానకంగా ఉంటుంది కానీ నేపాల్ గండకీ నదిలో నివసిస్తూ, దాని శరీరంలో ఊరే రసాయనాలతో మరియు ముళ్ళతో, పరమ పవిత్రమైన సాలిగ్రామాలను చెక్కుతుంది!” అని ఒక వింత జీవి ఫోటోను షేర్ చేస్తున్న పోస్టు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. ఇందులో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: ఫొటోలో ఉన్న జీవి పేరు ‘వజ్ర కీట’. ఇది నేపాల్‌లోని గండకీ నదిలో నివసిస్తూ దాని శరీరంలో ఊరే రసాయనాలతో సాలగ్రామాలను చెక్కుతుంది.

ఫ్యాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్న జీవి పేరు Hoplolichas tricuspidatus. ఇది 250 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించి పోయింది. ఫోటోలో కనిపిస్తున్నది ఆ జీవి యొక్క భద్రపరిచిన శిలాజము. ఆయితే, నేపాల్లోని గండకీ నదిలో దొరికే సాలగ్రామంలు ఏర్పడడానికి కారణం ‘ammonoid’ అనే జీవి యొక్క శిలాజాలు. ఇవి కీటకాలు చెక్కడం వల్ల ఏర్పడతాయి అని ఎక్కడా ఆధారాలు లేవు. కావున, పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా ఫోటోని రివర్స్ ఇమేజ్ సర్చ్ చేయగా, fossilmuseum.net అనే వెబ్సైటులో ఒక శిలాజాలకు (fossils) సంబంధించిన కథనంలో ఈ ఫోటో దొరికింది. ఈ కథనం ప్రకారం, ఫోటోలోని  జీవి పేరు ‘Hoplolichas tricuspidatus’. ఇది ‘trilobita’ అనే జాతికి చెందిన అంతరించిన జీవి.

ఈ సమాచారంతో ఇంటర్నెట్ లో వెతకగా, వివిధ వెబ్‌సైట్లలో దీని గురించి మరింత సమాచారం దొరికింది. Britannica వెబ్సైటు ప్రకారం ఈ జాతికి చెందిన జీవులు నీటిలో జీవిస్తాయి. ఇవి 542 మిలియన్ సంవత్సరాల నాటి జీవులు. ఇతర వెన్నెముక కలిగిన జీవుల లాగానే దీనకి కూడా బాహ్య ఆస్తి పంజరం (exoskeleton) ఉంటుంది. ఈ జీవి ఎదిగే క్రమంలో దానిని వదిలి పెడుతుంది. ఇలా వదిలి పెట్టబడిన అస్తిపంజరాలు, లేదా వాటిలో ఒక భాగం, ఇలా శిలాజాలుగా ఏర్పడుతాయి.

British Geological survey website ప్రకారం ఇవి 250 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించాయి.

వీటి గురించి మరింత సమాచారాన్ని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. అయితే, ఈ జీవులు సాలగ్రామాలను చెక్కుతాయి అని ఎక్కడా ఆధారాలు లేవు. The Hindu లో వచ్చిన ఆర్టికల్ ప్రకారం 240-260 మిలియన్ సంవత్సరాల క్రితం నివసించిన ‘Ammonites/Ammonoid’ అనే సముద్ర జీవుల శిలాజాలలు నేపాల్ లోని గండకీ నది ప్రాంతంలో ఎక్కువగా లభిస్తాయి. ఈ శిలాజలను సాలగ్రామం అనే పేరుతో విష్ణువు యొక్క మరో రూపంగా పూజిస్తారు.

బ్రిటానిక వెబ్సైటు ప్రకారం ఇవి అంతరించి పోయిన ‘Ammonoid’ ఉప జాతికి చెందిన జీవుల యొక్క శిలాజాలు.

చివరిగా, నేపాల్ లోని గండకీ నదిలో దొరికే సాలగ్రామాలు ‘Ammonoids’ అనే అంతరించిన జాతి యొక్క శిలాజాలు అని నిర్దారించవచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll