Update (29 April 2024)
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “బీజేపీ ప్రభుత్వంఏర్పాటు కాగానే రాజ్యాంగ విరుద్ధమైన SC, ST, OBC రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తాం” అని అన్నట్లు వీడియో(ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజేమెంటో చూద్దాం.
ఈ వైరల్ అమిత్ షా ప్రసంగం యొక్క పూర్తి నిడివి గల వీడియోని 23 ఏప్రిల్ 2023న ఈటీవీ తెలంగాణ(ETV Telangana) తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో “Vijay Sankalp Sabha in Chevella | Part of BJP Parliament Pravas Yojana | Amit Shah Attends || LIVE” అనే శీర్షికతో లైవ్ టెలికాస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో యొక్క వివరణలో, ఈ వీడియో 23 ఏప్రిల్ 2023న తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభకు సంబంధించినదని తెలిసింది.
ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, వైరల్ వీడియో క్లిప్పింగ్ లోని దృశ్యాలు టైంస్టాంప్ 03:07:15 వద్ద మొదలై, టైంస్టాంప్ 03:07:23 వద్ద ముగుస్తుంది అని తెలిసింది. వాస్తవంగా, ఈ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ “బీజేపీ ప్రభుత్వం రాగానే రాజ్యాంగ విరుద్ధమైన ఈ ముస్లిం రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తాం, రిజర్వేషన్లను పొందే ఈ అధికారం కేవలం తెలంగాణలోని SC, ST, OBC ఉంది, వారికీ మాత్రమే పొందాలి, ఈ ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం” అని అన్నారు. దీన్ని బట్టి ఈ సభలో అమిత్ షా చేసిన ప్రసంగం వీడియోను అక్కడక్కడ క్లిప్ చేసి ఎడిట్ చేస్తూ అమిత్ షా బీజేపీ ప్రభుత్వం రాగానే రాజ్యాంగ విరుద్ధమైన SC, ST, OBC రిజర్వేషన్లను రద్దు చేస్తాం అని అర్ధం వచ్చేలా వైరల్ వీడియోని రూపొందించారు అని నిర్ధారించవచ్చు. వాస్తవంగా, అమిత్ షా తెలంగాణలో విద్య, ఉద్యోగ నియామకాల్లో BC-E కేటగిరి కింద అమలు అవుతున్న 4% ముస్లిం రిజర్వేషన్లను, తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే రద్దు చేస్తాం అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం BC-E కేటగిరి పేరుతో 4% రిజర్వేషన్లను ముస్లింలకు కల్పించింది. అయితే ఈ BC-E రిజర్వేషన్లను ఉన్న BC రిజర్వేషన్లకు అదనంగా తీసుకొచ్చారు, అంటే వీటివల SC, ST, OBC రిజర్వేషన్లలో ఎలాంటి కోత లేదా మార్పు జరగలేదు. ఈ ప్రసంగాన్ని అమిత్ షా అధికారిక యూట్యూబ్ ఛానల్ కూడా 23 ఏప్రిల్ 2023న లైవ్ టెలికాస్ట్ చేసింది.
ఈ ఎడిట్ చేయబడిన అమిత్ షా వీడియో వైరల్ అవ్వగా, ఈ వీడియో పై చర్య తీసుకోవాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేశాయి. (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ)
Original (26 April 2024)
కేంద్ర హోంమంత్రి, బీజేపీ నాయకుడు అమిత్ షా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “2024లో మళ్ళీ మోదీ ప్రధాని అవుతారు, బీజేపీ ప్రభుత్వం రాగానే రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తాం “ అని అన్నట్లు వీడియో(ఇక్కడ & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజేమెంటో చూద్దాం.
క్లెయిమ్: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ “2024లో మళ్ళీ మోదీ ప్రధాని అవుతారు, బీజేపీ ప్రభుత్వం రాగానే రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తాం” అని చెప్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఎడిట్ చేసినది. 23 ఏప్రిల్ 2023న తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ “బీజేపీ ప్రభుత్వం రాగానే రాజ్యాంగ విరుద్ధమైన ఈ ముస్లిం రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తాం” అని అన్నారు. కావున, పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే ఈ వీడియో క్లిప్ చేసి ఎడిట్ చేసినట్లు అర్థమవుతుంది. ఈ వీడియో గురించి మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వైరల్ అమిత్ షా ప్రసంగం యొక్క పూర్తి నిడివి గల వీడియోని 23 ఏప్రిల్ 2023న ఈటీవీ తెలంగాణ (ETV Telangana) తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో “Vijay Sankalp Sabha in Chevella | Part of BJP Parliament Pravas Yojana | Amit Shah Attends || LIVE” అనే శీర్షికతో లైవ్ టెలికాస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ వీడియో యొక్క వివరణలో, ఈ వీడియో 23 ఏప్రిల్ 2023న తెలంగాణలోని చేవెళ్లలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభకు సంబంధించినదని తెలిసింది.
ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, వైరల్ వీడియో క్లిప్పింగ్ లోని దృశ్యాలు టైంస్టాంప్ 03:07:15 వద్ద మొదలై, టైంస్టాంప్ 03:07:23 వద్ద ముగుస్తుంది అని తెలిసింది. వాస్తవంగా, ఈ బహిరంగ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ “బీజేపీ ప్రభుత్వం రాగానే రాజ్యాంగ విరుద్ధమైన ఈ ముస్లిం రిజర్వేషన్లను పూర్తిగా రద్దు చేస్తాం” అని అన్నారు. దీన్ని బట్టి ఈ సభలో అమిత్ షా చేసిన ప్రసంగం వీడియోను అక్కడక్కడ క్లిప్ చేసి ఎడిట్ చేస్తూ అమిత్ షా బీజేపీ ప్రభుత్వం రాగానే రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను రద్దు చేస్తాం అని అర్ధం వచ్చేలా వైరల్ వీడియోని రూపొందించారు అని నిర్ధారించవచ్చు. ఈ అమిత్ షా ప్రసంగం సంబంధించిన మరిన్ని న్యూస్ రిపోర్ట్స్ ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు. ఈ ప్రసంగాన్ని అమిత్ షా అధికారిక యూట్యూబ్ ఛానల్ కూడా 23 ఏప్రిల్ 2023న లైవ్ టెలికాస్ట్ చేసింది.
చివరగా, కేంద్ర హోంమంత్రి, బీజీపీ నాయకుడు అమిత్ షా బీజేపీ ప్రభుత్వం మళ్ళీ రాగానే రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని అన్నారు అంటూ ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు