“దేశం మొత్తానికి వై.ఎస్. జగన్ ఒక్కడే సమర్థంగా పరిపాలించాడు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు” అంటూ ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.
క్లెయిమ్: దేశం మొత్తంలో వై.ఎస్. జగన్ ఒక్కడే సమర్థంగా పరిపాలించాడు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
ఫాక్ట్(నిజం): ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వై.ఎస్. జగన్ ఒక్కడే దేశం మొత్తంలో సమర్థంగా పాలించాడని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లేవు. వైరల్ పోస్టులో ఉన్న నిర్మలా సీతారామన్ ఫోటో 28 జూన్ 2021న జరిగిన పత్రికా సమావేశానికి సంబంధించినది. ఈ విలేకరుల సమావేశంలో నిర్మలా సీతారామన్ కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక రంగానికి మద్దతుగా తీసుకున్న చర్యల గురించి మరియు టూరిస్ట్ గైడ్‌లు/ట్రావెల్ ఏజెన్సీలకు ఆర్థిక సహాయం మరియు రుణాలను అందించడం గురించి మాట్లాడారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా వైరల్ పోస్ట్‌లో ముందుగా పేర్కొన్నట్లుగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ మాజీ సీఎం వై.ఎస్. జగన్ ను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎలాంటి రిపోర్ట్స్ లభించలేదు. ఒక వేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటే, ఖచ్చితంగా పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్టు చేసి ఉండేవి. అలాగే మేము నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా ఖాతాలను (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ ) కూడా పరిశీలించాము, అక్కడ ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఎలాంటి పోస్ట్‌లు చేయలేదు.
ఇకపోతే వైరల్ పోస్టులో నిర్మలా సీతారామన్ ఫోటోకు సంబంధించిన సమాచారం కోసం గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా , ఈ పోస్టులో కనిపిస్తున్న నిర్మలా సీతారామన్ ఫోటో 28 జూన్ 2021న జరిగిన ఓ పత్రిక సమావేశానికి సంబంధించినదిగా తెలిసింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ విలేకరుల సమావేశంలో నిర్మలా సీతారామన్ కోవిడ్ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటక రంగానికి మద్దతుగా తీసుకున్న చర్యల గురించి మరియు టూరిస్ట్ గైడ్‌లు/ట్రావెల్ ఏజెన్సీలకు ఆర్థిక సహాయం మరియు రుణాలను అందించడం గురించి మాట్లాడారు.
అలాగే ఈ వైరల్ పోస్టులో ఉన్న యూట్యూబ్ లింక్ లో చెప్పిన ఎస్బీఐ(SBI) రీసెర్చ్ పేపర్ ఇక్కడ చూడవచ్చు.
చివరగా, వై.ఎస్. జగన్ ఒక్కడే దేశం మొత్తంలో సమర్థంగా పాలించాడని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించలేదు.