Fake News, Telugu
 

సంబంధం లేని ఫోటోలను ఇప్పుడు కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

PawanKalyan పిలుపు మేరకు బాగున్న రోడ్లను తవ్వి ఫొటోస్ తీసి ట్విట్టర్లో పెట్టీ, రోడ్లు గుంటలు అంటూ #GoodMorningCMSir అనీ trend చేస్తున్న జనసేన కార్యకర్తలు.” అని ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేయబడుతుంది.ఇందులోని నిజా నిజాలు  తెలుసుకొందాం.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన కార్యకర్తలు బాగున్న  రోడ్లను తవ్వి గుంతలు అంటూ ట్విట్టర్ లో  ట్రెండ్ చేస్తున్నారు.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో కర్ణాటక రాష్ట్రం లోని హొన్నెటాలు అనే గ్రామంలో తీసినది. ఆ గ్రామంలో కొత్తగా వేసిన రోడ్ పెచ్చులుగా ఊడిపోవటం గురించి గ్రామస్తులు ఈ ఫొటోలో చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఫొటోకి ఎటువంటి సంబంధం లేదు. కావున, ఈ పోస్ట్ లో చెప్తున్నది తప్పు.

పోస్ట్ లో ఉన్న చిత్రాన్ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా మాకు ‘ది హిందూ’ పత్రికలోని ఒక న్యూస్ రిపోర్ట్ లింక్ దొరికింది. ఇందులో కర్ణాటకు చెందిన  హొన్నెటాలు  గ్రామంలో ‘కొత్త రోడ్డు ఉపరితలం తెగిపోతోందని గ్రామస్తులు వాపోయారు’ అని రాసారు. ఇదే కథనం పైన విజయ్ కర్ణాటక వారు కుడా ఒక న్యూస్ రిపోర్ట్ రాసారు. అది ఇక్కడ చదవొచ్చు. ఈ ఫోటోకి ఆంధ్రప్రదేశ్‌కి ఎటువంటి సంబంధం లేదని ఈ వివరాల ఆధారంగా చెప్పవొచ్చు.

మరొక పోస్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ రోడ్ల దుస్థితి అని ఇంకో ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. కానీ, ఈ ఫొటోలో ఉన్న రోడ్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి  సంబంధించినవి కావు FACTLY ఇదివరకే ఒక ఆర్టికల్‌లో వివరించడం జరిగింది.

అయితే ఇటీవల కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు-పేరేచర్ల రోడ్డులో గుంతలు ఏర్పడ్డాయంటూ మీడియా సంస్థలు రిపోర్ట్ చేసాయి.

చివరిగా, సంబంధం లేని ఫోటోలను ఇప్పుడు కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రోడ్లకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll