Fake News, Telugu
 

ఈ ఫోటోలో గుంతలతో ఉన్న రోడ్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినవి కావు

0

ఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితి అని చెప్తూ, గుంతలతో ఉన్న రోడ్ల ఫోటోలను కొంత మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇదే ఫోటోను ఇంకొందరు తెలంగాణ రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి అని, మరికొందరు ఔరంగాబాద్ నగరం పరిస్థితి అని ప్రచారం చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో గుంతలతో ఉన్న రోడ్లు ఫోటోలు.

ఫాక్ట్: ఫోటోలో గుంతలతో ఉన్న రోడ్లు ఆంధ్రప్రదేశ్ కి లేదా తెలంగాణకి సంబంధించినవి కావు. వివిధ ప్రదేశాలకు సంబంధించినవి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ చేసిన ఫోటోలో చాలా ఫోటోలు ఉన్నట్టు చూడవొచ్చు. ఒక్కో ఫోటో ఎక్కడిదో తెలుసుకుందాం.

ఫోటో 1: చికాగో (అమెరికా)

ఫోటో 2: డార్లింగ్టన్ (ఇంగ్లాండ్)

ఫోటో 3: రష్యా

ఫోటో 4: ముంబై

ఫోటో 5: సాకేత్ రోడ్, థానే (మహారాష్ట్ర)

ఫోటో 6: కళ్యాణ్ (మహారాష్ట్ర)

ఫోటో 7: ముంబై

మిగిలిన ఫోటోలు కూడా ఆంధ్రప్రదేశ్ కి లేదా తెలంగాణకి సంబంధించినవని చెప్పడానికి ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు దొరకలేదు.

చివరగా, ఫోటోలో గుంతలతో ఉన్న రోడ్లు ఆంధ్రప్రదేశ్ కి లేదా తెలంగాణకి సంబంధించినవి కావు. వివిధ ప్రదేశాలకు సంబంధించినవి.

వివరణ (OCTOBER 13, 2020):
పోస్టులోని ఫొటోలో గుంతలతో ఉన్న రోడ్లు మొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి సంబంధించినవి అని ప్రచారం అవ్వగా, తరువాత తెలంగాణకి సంబంధించినవని ప్రచారం జరిగింది. ఆర్టికల్ శీర్షిక మరియు వివరణ దానికి తగినట్టుగా మార్చబడినది.

Share.

About Author

Comments are closed.

scroll