Fake News, Telugu
 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నటుడు శోభన్ బాబు వీడియో డీప్ ఫేక్ టెక్నాలజీ వాడి ఎడిట్ చేయబడింది

0

‘నటుడు శోభన్ బాబు మళ్ళీ పుట్టాడు’ అంటూ సోషల్ మెడియాలో ఒక వ్యక్తి బీచ్‌లో నడిచి  వస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది. దీని వెనుక ఉన్న వాస్తవం ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.  

A person in a white shirt

క్లెయిమ్: ఈ వీడియోలో ఉన్నది నటుడు శోభన్ బాబును పోలిన వ్యక్తి.

ఫాక్ట్(నిజం): ఈ వీడియో కెవిన్ లుటోల్ఫ్ అనే ఒక స్విస్ మోడల్ యొక్క షూట్ వీడియో. ఇది డీప్ ఫేక్ టెక్నాలజీ వాడి ఎడిట్ చేయబడింది. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ వీడియో యొక్క కీ ఫ్రేములను ఉపయోగించి రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే కెవిన్ లుటోల్ఫ్ అనే వ్యక్తి యొక్క యూట్యూబ్ ఛానెల్‌ల్లో తాను బీచ్‌లో నడిచివస్తున్న రీల్‌కు దారి తీసింది.

వైరల్ వీడియోను కెవిన్ తన ఇంస్టాగ్రామ్ లో కూడా అప్లోడ్ చేస్తూ ఇది ఒక ఘాట్ వీడియో అని పోస్ట్ చెయ్యటం గమనించాం. తన సోషల్ మీడియాను పరిశీలించగా (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఇతను ఒక స్విస్ మోడల్, నటుడు మరియు కంటెంట్ క్రియేటర్ అని తెలుసుకున్నాం. వైరల్ అవుతున్న వీడియోను అసలు వీడియోతో పోల్చిచూడగా, వైరల్ వీడియో ఒక డీప్ ఫేక్ అని నిర్ధారిచవచ్చు.

చివరిగా, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్ననటుడు శోభన్ బాబు వీడియో డీప్ ఫేక్ టెక్నాలజీ వాడి ఎడిట్ చేయబడింది.   

Share.

About Author

Comments are closed.

scroll