Fake News, Telugu
 

పాత ఫోటోలు పెట్టి, ‘షహీన్ బాగ్ లో బురఖాలో పోలీసులకి పట్టుబడ్డ యువకుడు’ అని చెప్తున్నారు.

0

ఫేస్బుక్ లో రెండు ఫోటోలు పెట్టి, ఢిల్లీ షహీన్ బాగ్ లో CAA కి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో బురఖాలో పోలీసులకి పట్టుబడ్డ యువకుడు అంటూ చెప్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: షహీన్ బాగ్ లో జరుగుతున్న ఉద్యమంలో బురఖాలో పోలీసులకి పట్టుబడ్డ యువకుడి ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): షహీన్ బాగ్ వద్ద మహిళలు CAA కి వ్యతిరేకంగా ‘15 డిసెంబర్ 2019’ నుండి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ, పోస్టులోని ఫోటోలు ఇంటర్నెట్ లో కనీసం అక్టోబర్ 2015 నుండి ఉన్నట్లుగా చూడవొచ్చు. కావున, పోస్టులో చెప్పింది తప్పు.

పౌరసత్వ సవరణ చట్టం (CAA) కు వ్యతిరేకంగా మహిళలు షహీన్ బాగ్ వద్ద ‘15 డిసెంబర్ 2019’ నుండి నిరసనలు తెలుపుతున్నట్లు ‘Indian Express’ కథనం ద్వారా తెలుసుకోవచ్చు.

పోస్టులోని ఫోటోలను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ‘Schoop Whoop’ వారి కథనం లో లభించింది. ఆ కథనం ని ‘1 అక్టోబర్ 2015’ న ప్రచురించినట్లుగా ఉంది. ఆ కథనంలో ఫొటోలోని వ్యక్తి ఆరెస్సెస్ కార్యకర్త అనీ, బురఖ ధరించి గోమాంసాన్ని గుడిలోకి విసిరినప్పుడు అతన్ని పట్టుకున్నారంటూ ఫేస్బుక్ లో ప్రచారం అవుతున్నట్లుగా ఉంది. ఆ ఫోటోల గురించి మరింత సమాచారం ఏమీ లభించలేదు. కానీ, ఆ ఫోటోలు షహీన్ బాగ్ వద్ద మహిళలు CAA కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న దాని కంటే ముందు నుండి ఉన్నట్లుగా గుర్తించబడినవి కాబట్టి, వాటికి ఆ నిరసనలకి సంబంధం లేదని చెప్పవచ్చు. 

చివరగా, పాత ఫోటోలని పెట్టి, ‘షహీన్ బాగ్ లో బురఖాలో పోలీసులకి పట్టుబడ్డ యువకుడు’ అని చెప్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll