Fake News, Telugu
 

బ్రెజిల్‌లో ఒక మహిళ హత్యకు చెందిన వీడియోని మణిపూర్‌లో జరిగిన సంఘటన అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

మణిపూర్‌లో RSS సభ్యులు ఓ మహిళను దారుణంగా చంపిన సంఘటన యొక్క దృశ్యాలు అని, ఓ మహిళను నరికి చంపిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ఒక పోస్టు ద్వారా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ గురుంచి నిజా నిజాల్ని   చూద్దాం.

క్లెయిమ్: RSS సభ్యులు ఒక మణిపురి మహిళను దారుణంగా నరికి చంపిన దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఇది బ్రెజిల్ దేశంలో జరిగిన ఒక పాత 2020 నాటి సంఘటన వీడియో. థాలియా టోర్రెస్ డి సౌజా అనే 23 ఏళ్ల మహిళ హత్యను ఈ వీడియో చూపిస్తుంది. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియో గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి, మేము ఇంటర్నెట్‌లో వీడియో యొక్క  కొన్ని కీఫ్రేమ్‌లపై రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసాము. ఈ సెర్చ్ మమ్మల్ని ఈ వైరల్ వీడియో యొక్క స్క్రీన్‌షాట్‌లను కలిగి ఉన్న 2020 నాటి ఒక బ్రెజిల్ వార్తా సంస్థ ప్రచురించిన  వార్తా కథనానికి దారితీసింది. బ్రెజిల్‌లో జరిగిన ఓ మహిళ హత్యకు సంబంధించిన వీడియోగా ఈ కథనం దీన్ని వివరించింది.

ఈ క్లూతో మేము సంబంధిత కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో మరింత వెతకగా, వీడియోలో ఉన్న  మహిళ పేరు థాలియా టోర్రెస్ డి సౌజాగా వివరించిన ఒక ట్వీట్ మరియు ఒక  వార్తా కథనం  లభించాయి. ఆమెను కొందరు క్రిమినల్ ఫ్యాక్షన్ సభ్యులు కిడ్నాప్ చేసి, తాళ్లతో బంధించి హత్య చేసినట్లు సమాచారం. ఆమె మరణించే సమయానికి డి సౌజా వయస్సు 23 సంవత్సరాలు. మణిపూర్‌లో ఒక మహిళను RSS  సభ్యులు నరికి చంపిన వీడియో అని షేర్ చేస్తున్న వైరల్ కథనంలో వాదన తప్పు అని ఈ సాక్ష్యాలు  స్పష్టంగా రుజువు చేస్తున్నాయి.

చివరిగా, బ్రెజిల్‌లో ఒక మహిళను దారుణంగా హత్య చేసిన వీడియో మణిపూర్‌లో జరిగిన సంఘటన అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll