Fake News, Telugu
 

ప్రధాని మోదీ ఒక NGO వర్కర్ కి నమస్కారం చేస్తున్న ఫోటోని, అదాని భార్యకు నమస్కరిస్తునట్టు తప్పుగా షేర్ చేస్తున్నారు

0

‘అదాని భార్యకు వంగి వంగి దండాలు పెడుతున్న కార్పొరేట్ ప్రధాని నరేంద్ర మోదీ’, అంటూ షేర్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వ్యాపారవేత్త, అదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదాని భార్య ప్రీతి అదాని కి మోదీ ఇలా నమస్కరించినట్టు ఈ పోస్టులో క్లెయిమ్ చేస్తున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గౌతమ్ అదాని భార్య ప్రీతి అదాని కి వంగి వంగి నమస్కారం చేస్తున్న నరేంద్ర మోదీ.

ఫాక్ట్ (నిజం):  ఈ ఫోటోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమస్కారం చేస్తున్నది ‘Divya Jyoti Cultural Organization and Welfare Society’ చీఫ్ ఫంక్షనల్ ఆఫీసర్ దీపిక మండోల్ కి, గౌతమ్ అదాని భార్య ప్రీతి అదాని కి కాదు. ఈ ఫోటో 2015లో జరిగిన ఒక ఈవెంట్ లో తీసినది. కావున, పోస్టుల చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటో యొక్క స్క్రీన్ షాట్ ని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ ‘Divya Marathi’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ఫోటోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నమస్కారం చేస్తున్నది ‘Divya Jyoti Cultural Organization and Welfare Society’ చీఫ్ ఫంక్షనల్ ఆఫీసర్ దీపిక మండోల్ అని ఆర్టికల్ లో తెలిపారు. ఏప్రిల్ 2015లో జరిగిన ఒక ఈవెంట్ లో ఈ ఫోటో తీసినట్టు అందులో తెలిపారు. ఇదే విషయాన్నీ తెలుపుతూ ‘Amar Ujala’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు.

తను చేస్తున్న స్వచ్ఛంద సేవా పనులని అభినందిస్తూ, ప్రధాని మోదీ ఇలా తనకు నమస్కారం చేసినట్టు దీపిక మండోల్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. పోస్టులో షేర్ చేసిన అదే ఫోటోని ఈ వీడియోలో 2.47 నిమిషాల దగ్గర చూడవచ్చు.

Divya Jyoti Cultural Organization and Welfare Society’ లో చీఫ్ ఫంక్షనల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న దీపిక మండోల్, భారతదేశ సంస్కృతీ, విద్య, ఇన్ఫర్మేషన్ & టెక్నాలజీ వంటి వాటి వ్యాప్తి కోసం పని చేస్తుంటారు. భారత దేశం యొక్క కళలు మరియు సంస్కృతులని  ప్రమోట్ చేయడం, ఈ NGO యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఫోటోని ప్రీతి అదాని యొక్క ఫోటోలతో పోలిక చేసి చూడగా, పోస్టులో షేర్ చేసిన ఫోటోలో కనిపిస్తున్నది గౌతమ్ అదాని భార్య ప్రీతి అదాని కాదని తెలుస్తుంది.

ఇదివరకు, గౌతమ్ అదాని భార్యకు ప్రధాని మోదీ వంగి వంగి నమస్కారాలు చేస్తునారని షేర్ చేసిన ఫేక్ ఫోటో తప్పని తెలుపుతూ FACTLY ఆర్టికల్ ని పబ్లిష్ చేసింది.

చివరగా, ఫోటోలో నరేంద్ర మోదీ నమస్కారం చేస్తున్నది NGO వర్కర్ దీపికా మండోల్ కి, గౌతమ్ అదాని భార్య ప్రీతి అదాని కి కాదు.

Share.

About Author

Comments are closed.

scroll