Fake News, Telugu
 

‘భారత సైన్యం ధైర్య సాహసాల ప్రదర్శన’ అని చెప్తూ పెట్టిన ఈ వీడియో భారతదేశానికి సంబంధించింది కాదు.

0

భారత సైన్యం ధైర్య సాహసాల ప్రదర్శన అరుదైన వీడియో’ అని చెప్తూ, ఒక వీడియోని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్:  భారత సైన్యం ధైర్య సాహసాల ప్రదర్శనకి సంబంధించిన అరుదైన వీడియో.

ఫాక్ట్: పోస్ట్ లోని వీడియో అసలు భారతదేశానికి సంబంధించిన వీడియో కాదు. వీడియోలోని ట్రక్కుల స్టీరింగ్ ఎడమ వైపు ఉంది మరియు నెంబర్ ప్లేట్లు కూడా భారతదేశానివి కావు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, చాలా వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ వస్తాయి. ఆ వీడియో రష్యా కి సంబంధించిందని,  ఆ వీడియోలోని వారు అడవుల్లోని వెల్లుల్లి సేకరించడం కోసం కొండల్లోకి వెళ్తున్నట్టు కొందరు ఫిబ్రవరి 2019 లో పోస్ట్ చేసినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. పోస్ట్ లోని వీడియో యొక్క హై క్వాలిటీ వీడియోని ఇక్కడ చూడవొచ్చు.

సోషల్ మీడియా పోస్టులు తప్ప వీడియోకి సంబంధించి కచ్చితమైన సమాచారం దొరకనప్పటికీ, వీడియోలోని కొన్ని క్లూస్‌ బట్టి వీడియో అసలు భారతదేశానికి సంబంధించింది కాదని చెప్పవొచ్చు. వీడియోలోని ట్రక్కుల స్టీరింగ్ ఎడమ వైపు ఉన్నట్టు చూడవొచ్చు. జనరల్ గా భారతదేశంలో వాహనాలకు స్టీరింగ్ కుడి వైపు ఉంటుంది. వీడియోలోని ట్రక్కుల నెంబర్ ప్లేట్లు కూడా భారతదేశానివి కావు. భారతదేశంలో వాహనాల ట్రక్కుల నెంబర్ ప్లేట్ల పై మొదట రెండు అక్షరాలు రాష్ట్రానికి సంబంధించిన కోడ్ ఉండి, తరువాతి రెండు నెంబర్లు (రిజిస్ట్రేషన్ ప్రదేశం కోడ్) ఉంటాయి. కానీ, వీడియోలోని ట్రక్కు నెంబర్ ప్లేట్ పై ఒక అక్షరం ఉండి, మూడు నెంబర్లు ఉన్నట్టు చూడవొచ్చు. డిజైన్ కూడా రష్యా నెంబర్ ప్లేట్ల లాగా ఉన్నట్టు చూడవొచ్చు.

వీడియోలోని ప్రదేశానికి సంబంధించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు ఉన్నాయి. వాటిల్లో కొన్నిటిని ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ చూడవొచ్చు. వేరే వీడియోలో ఒక వ్యక్తి వేసుకున్న జాకెట్ పై ‘Велесстрой’ అని రష్యన్ లో రాసి ఉన్నట్టు చూడవొచ్చు. దాని ఆంగ్ల అనువాదం – ‘Velesstroy’, అది ఒక రష్యన్ కంపెనీ.

చివరగా, ‘భారత సైన్యం ధైర్య సాహసాల ప్రదర్శన’ అని చెప్తూ పెట్టిన వీడియో భారతదేశానికి సంబంధించింది కాదు.

Share.

About Author

Comments are closed.

scroll