Fake News, Telugu
 

ఒక ముస్లిం వ్యక్తి సొంత కూతురితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు అని చెప్తూ స్క్రిప్టెడ్ వీడియోను నిజమైన ఘటనగా షేర్ చేస్తున్నారు

0

“ఒక ముస్లిం వ్యక్తి తన సొంత కూతురితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో బుర్ఖా ధరించిన ఓ యువతి తన తండ్రి  ప్రతి రోజూ రాత్రి తనను శారీరకంగా అనుభవిస్తున్నాడని చెప్పడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఓ ముస్లిం యువతి తన తండ్రి ప్రతి రోజూ రాత్రి తనను శారీరకంగా అనుభవిస్తున్నాడని చెప్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలో చూపిస్తున్నది వాస్తవంగా చోటుచేసుకున్న ఘటన కాదు. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోను ‘అశ్వని పాండే (Ashwani Pandey)’ అనే కంటెంట్ క్రియేటర్ తన యూట్యూబ్ ఛానెల్, ఫేస్‌బుక్‌లో 13 ఫిబ్రవరి 2025న షేర్ చేశాడు. ఈ వీడియోను కేవలం ‘వినోదం’ కోసం మాత్రమే రూపొందించబడిందని ఈ వీడియోలో ఒక డిస్‌క్లైమర్ (Disclaimer) ఉంది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలు కలిగిన అధిక నిడివి గల వీడియోను (ఆర్కైవ్డ్) ‘అశ్వని పాండే (Ashwani Pandey)’ అనే యూట్యూబ్ ఛానెల్ 13 ఫిబ్రవరి 2025న షేర్ చేసినట్లు కనుగొన్నాము. ఈ వీడియోను మనం జాగ్రతగా పరిశీలిస్తే టైంస్టాంప్ 0.06 వద్ద ఈ వీడియోను కేవలం ‘వినోదం’ కోసం మాత్రమే రూపొందించబడిందని ఒక వివరణ (Disclaimer) ఉండటం మనం గమనించవచ్చు. దీన్ని బట్టి, ఈ వీడియోలోని సంఘటన నిజంగా జరగలేదని మనం నిర్ధారించవచ్చు. అలాగే, ఈ యూట్యూబ్ ఛానెల్‌లో మనం ఇలాంటి పలు స్క్రిప్టెడ్ వీడియోలను చూడవచ్చు (ఇక్కడ).

అశ్వని పాండే 13 ఫిబ్రవరి 2025న ఇదే వీడియోను తన ఫేస్‌బుక్‌లో కూడా షేర్ (ఆర్కైవ్డ్) చేశాడు, అందులో కూడా ఈ వీడియోను కేవలం ‘వినోదం’ కోసం మాత్రమే రూపొందించబడిందని ఒక వివరణ (Disclaimer) ఉండటం మనం గమనించవచ్చు.

అశ్వని పాండే తన ఫేస్‌బుక్‌ పేజీలో అతనొక నటుడు, ప్రాంక్ వీడియోలు రూపకర్తగా పేర్కొన్నాడు. అశ్విని పాండే ఫేస్‌బుక్ పేజీలో ఇలాంటి పలు ఇతర స్క్రిప్టెడ్ వీడియోలను మనం చూడవచ్చు.

అలాగే ఈ వైరల్ వీడియోలో తండ్రిగా నటించిన వ్యక్తి యొక్క మరొక స్క్రిప్టెడ్ వీడియో ‘ఒక ముస్లిం వ్యక్తి తన సొంత కూతురిని పెళ్లి చేసుకున్నాడు’ అంటూ వైరల్ కాగా, అది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని చెప్తూ Factly రాసిన ఫాక్ట్–చెక్ కథనాన్ని ఇక్కడ చూడవచ్చు.  

ఇంతకముందు కూడా ఇలాంటి స్క్రిప్టెడ్ వీడియోలు నిజమైన ఘటనలుగా సోషల్ మీడియాలో వైరల్ కాగా, వాటిని ఫాక్ట్–చెక్ చేస్తూ Factly రాసిన కథనాలను ఇక్కడ, ఇక్కడఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు.

చివరగా, స్క్రిప్టెడ్ వీడియోని షేర్ చేస్తూ, ఒక ముస్లిం వ్యక్తి తన సొంత కూతురితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు అని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll