Fake News, Telugu
 

కేవలం కేరళ రాష్ట్ర సివిల్ సర్వీస్ అకాడమీ (KSCSA) యొక్క పొన్నాని సబ్ సెంటర్‌లో మాత్రమే ముస్లింలకి 50% రిజర్వేషన్ ఉంది

0

IAS, IPSలను తయారు చేసే వ్యవస్థలలో ముస్లింలకు 50% రిజర్వేషన్ కేరళలో కల్పిస్తున్నారని కేరళ రాష్ట్ర సివిల్ సర్వీస్ అకాడమీ (KSCSA) విడుదల చేసిన ఒక ప్రకటనను ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కేరళ రాష్ట్ర సివిల్ సర్వీస్ అకాడమీలో ముస్లింలకు 50% రిజర్వేషన్.

ఫాక్ట్: కేరళ రాష్ట్ర సివిల్ సర్వీస్ అకాడమీ (KSCSA) యొక్క పొన్నాని సబ్ సెంటర్‌లో మాత్రమే ముస్లింలకి 50% రిజర్వేషన్ ఉంది. KSCSA ఇతర సబ్ సెంటర్లలో ముస్లింలకి 50% రిజర్వేషన్ లేదు. తిరువనంతపురంలోని చరాచిరాలోని ప్రధాన కేంద్రం కాకుండా, కేరళ రాష్ట్ర సివిల్ సర్వీస్ అకాడమీకి సంబంధించి తొమ్మిదికి పైగా సబ్ సెంటర్‌లు ఉన్నాయి. KSCSA కల్లియస్సేరీ సబ్ సెంటర్‌లో మొత్తం సీట్లలో 51% ఎస్సీ వర్గాలకు రిజర్వ్ చేయబడ్డాయి. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.        

ఇటీవల, కేరళ రాష్ట్ర సివిల్ సర్వీస్ అకాడమీ (KSCSA) UPSC సివిల్ సర్వీసెస్ పరీక్ష కొరకు కోచింగ్ ఇచ్చే తరగతుల్లో ప్రవేశం కోసం వాళ్ళు నిర్వహించే ప్రవేశ పరీక్షకు దరఖాస్తులను ఆహ్వానించింది.

కేరళ రాష్ట్ర సివిల్ సర్వీస్ అకాడమీ వెబ్‌సైట్‌ని సెర్చ్ చేసినప్పుడు, వారి వెబ్‌సైట్‌లో అడ్మిషన్ విధానం గురించి ప్రకటన చేసినట్లు చూడొచ్చు. ఆ వెబ్‌సైట్ ప్రకారం, పొన్నాని సబ్ సెంటర్‌లో మాత్రమే ముస్లింలకి 50% రిజర్వేషన్ ఉంది. కేరళ రాష్ట్ర సివిల్ సర్వీస్ అకాడమీలోని ఇతర సబ్ సెంటర్లలో ముస్లింలకి రిజర్వేషన్ లేదు. తిరువనంతపురంలోని చరాచిరాలోని ప్రధాన కేంద్రం కాకుండా, కేరళ రాష్ట్ర సివిల్ సర్వీస్ అకాడమీకి సంబంధించి తొమ్మిదికి పైగా సబ్ సెంటర్‌లు ఉన్నాయి. KSCSA కల్లియస్సేరీ సబ్ సెంటర్‌లో మొత్తం సీట్లలో 51% ఎస్సీ వర్గాలకు రిజర్వ్ చేయబడ్డాయి.

అన్నీ KSCSA కేంద్రాలలో రెగ్యులర్ బ్యాచ్‌లలో 10% సీట్లు SC/ST వర్గాలకు చెందిన విద్యార్థులకు రిజర్వ్ చేయబడ్డాయి. ఎస్సీ విద్యార్థులు అందుబాటులో లేకుంటే, ఖాళీగా ఉన్న సీట్లను ఎస్టీ కమ్యూనిటీ విద్యార్థుల నుంచి భర్తీ చేస్తారు. రిజర్వేషన్ కేటగిరీ కింద ఎంపికైన విద్యార్థులు ట్యూషన్ ఫీజు మరియు GST చెల్లించాల్సిన అవసరం లేదు. రిజర్వేషన్ కేటగిరీలో తగినంత మంది విద్యార్థులు అందుబాటులో లేకుంటే, ఇతర వర్గాల విద్యార్థులను చేర్చుకోవడానికి KSCSAకి స్వేచ్ఛ ఉంటుంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న 100 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు. SC/ST మరియు ముస్లిం కమ్యూనిటీ రిజర్వేషన్ల కింద ప్రయోజనం పొందినవారు ఈ కేటగిరి కిందికి రారు.

పొన్నానిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెరీర్ స్టడీస్ & రీసెర్చ్ (ICSR) కేరళ ప్రభుత్వంచే స్థాపించబడిన స్వయంప్రతిపత్తి సంస్థ అయిన సెంటర్ ఫర్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ కేరళ (CCEK) క్రింద స్థాపించబడింది.

కేరళలో జస్టిస్ సచార్ కమిషన్ నివేదిక అమలును అధ్యయనం చేయడానికి, అప్పటి స్థానిక స్వపరిపాలన మంత్రి (Minister for Local Self Government) పలోలి మహమ్మద్ కుట్టి అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అడ్మినిస్ట్రేటివ్ క్యాడర్‌లో మరియు ప్రభుత్వ ఉన్నత పదవులలో ముస్లిం ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉందని, ఈ తగ్గింపును ప్రత్యేక కోచింగ్ ఇవ్వడం ద్వారా మరియు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించడం ద్వారా పరిష్కరించాలని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. అందుకే పొన్నానిలో 2010లో ఏర్పాటైన కోచింగ్ సెంటర్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. 2018లో కూడా ముస్లిం కమ్యూనిటీకి, పొన్నానిలో అదే రిజర్వేషన్ ఉన్నట్టు తెలుస్తుంది.

చివరగా, కేవలం కేరళ రాష్ట్ర సివిల్ సర్వీస్ అకాడమీ (KSCSA) యొక్క పొన్నాని సబ్ సెంటర్‌లో మాత్రమే ముస్లింలకి 50% రిజర్వేషన్ ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll