Fake News, Telugu
 

2019 న్యూస్ వీడియోని రైతులు చేస్తున్న ప్రస్తుత నిరసనలతో ముడిపెడుతున్నారు.

0

‘రైతు ధర్నాలో పాల్గొన్న ముసుగు ఉగ్రవాదులని అరెస్ట్ చేసిన పంజాబ్ ప్రభుత్వం’, అని షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్’ ఉగ్రవాద సంస్థకి చెందిన నలుగురు ఉగ్రవాదులని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు, ‘ETV ఆంధ్రప్రదేశ్’ న్యూస్ ఛానల్ రిపోర్ట్ చేసిన వీడియోని ఈ పోస్టులో షేర్ చేసారు. కొత్తగా అమలులోకి తెచ్చిన వ్యవసాయ బిల్లులని వ్యతిరేకిస్తూ రైతులు దేశవ్యాప్తంగా నిరసన చేస్తున్న నేపథ్యంలో, ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రైతు ధర్నాలో పాల్గొన్న ముసుగు ఉగ్రవాదులని అరెస్ట్ చేసిన పంజాబ్ పోలీసులు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. ‘ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్’ అనే ఉగ్రవాద సంస్థకి చెందిన నలుగురు ఉగ్రవాదులని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు ‘ETV ఆంధ్రప్రదేశ్’ న్యూస్ ఛానల్ ‘25 సెప్టెంబర్ 2019’ నాడు రిపోర్ట్ చేసింది. ఈ వీడియోకి ఇటివల రైతులు వ్యవసాయ బిల్లులకి సంబంధించి చేస్తున్న నిరసనలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం ‘ETV ఆంధ్రప్రదేశ్’ యూట్యూబ్ ఛానెల్లో వెతికితే, ఈ వీడియోని ‘ETV ఆంధ్రప్రదేశ్’ న్యూస్ ఛానల్ ‘25 సెప్టెంబర్ 2019’ నాడు రిపోర్ట్ చేసినట్టు తెలిసింది. ‘ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్’ కి చెందిన నలుగురు ఉగ్రవాదులని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు ఈ వీడియోలో తెలిపారు. పంజాబ్ సహా పలు రాష్ట్రాల్లో వరుస దాడులు చేయటానికి ఈ ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్టు వీడియోలో రిపోర్ట్ చేసారు. అరెస్ట్ చేసిన నలుగురు ఉగ్రవాదుల నుండి AK47 తో సహా మరికొన్ని ఆయుధాలు పంజాబ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు ఈ వీడియోలో తెలిపారు.

ఈ అరెస్ట్ కి సంబంధించి సెప్టెంబర్ 2019లో రిపోర్ట్ చేసిన మరికొన్ని న్యూస్ ఆర్టికల్స్ ని, వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ‘04 సెప్టెంబర్ 2019’ నాడు తాన్ తరన్ నగరంలో జరిగిన బాంబు దాడి లో, ఈ ఉగ్రవాదులు కీలక పాత్ర పోషించినట్టు ఆర్టికల్స్ లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన వీడియో ఇటివల రైతుల వ్యవసాయ బిల్లులని వ్యతిరేకిస్తూ చేస్తున్న నిరసనలకి సంబంధించినది కాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

రైతు ధర్నాలో పాల్గొన్న ముసుగు ఉగ్రవాదులని అరెస్ట్ చేసిన పోలీసులంటూ షేర్ చేసిన కొన్ని ఫేక్ పోస్టులని తప్పని చెప్తూ FACTLY పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 2019లో రిపోర్ట్ చేసిన న్యూస్ వీడియోని చూపిస్తూ రైతు ధర్నాలో పాల్గొన్న ముసుగు ఉగ్రవాదులని పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll