Fake News, Telugu
 

ఈ ఫోటోలో ప్రధాని మోదీ కి గొడుగు పట్టుకొని ఉన్నది కిర్గిజ్‌స్థాన్ అధ్యక్షుడు

0

ప్రధాని మోదీ కి ‘చైనా గులాం గిరీ’ అని చెప్తూ, ఒక వ్యక్తి మోదీ కి గొడుగు పట్టుకొని ఉన్న ఫోటోని కొందరు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.    

క్లెయిమ్: ప్రధాని మోదీ కి చైనా లీడర్ గొడుగు పట్టుకొని ఉన్న ఫోటో.

ఫాక్ట్: ఫోటోలో గొడుగు పట్టుకొని ఉన్నది కిర్గిజ్‌స్థాన్ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్; చైనా లీడర్ కాదు. పోస్ట్ లోని ఫోటోకీ, చైనా కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, చాలా ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఫోటోలో గొడుగు పట్టుకొని ఉన్నది కిర్గిజ్‌స్థాన్ అధ్యక్షుడు సూరోన్‌బే జీన్‌బెకోవ్ అని ‘టైమ్స్ అఫ్ ఇండియా’ వారి ఆర్టికల్ లో చదవొచ్చు. 2019 లో మోదీ కిర్గిజ్‌స్థాన్ కి వెళ్ళినప్పుడు, ఒక ప్రోగ్రాం సందర్భంగా వర్షం పడడంతో కిర్గిజ్‌స్థాన్ ప్రెసిడెంట్ సూరోన్‌బే జీన్‌బెకోవ్ గొడుగు పట్టుకున్నాడు.

‘ప్రసార భారతి’ వారు కూడా ఈ ఫోటోని 2019 లో ట్వీట్ చేసినట్టు ఇక్కడ చూడవొచ్చు. ఆ ప్రోగ్రాం కి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడవొచ్చు. కావున, పోస్ట్ లోని ఫోటోకీ, చైనా కి ఎటువంటి సంబంధంలేదు.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటించినప్పుడు మోదీ మరియు షీ జిన్‌పింగ్ గొడుగు పట్టుకొని ఉన్న ఫోటోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ఫోటోలో ప్రధాని మోదీ కి గొడుగు పట్టుకొని ఉన్నది కిర్గిజ్‌స్థాన్ ప్రెసిడెంట్ సూరోన్‌బే జీన్‌బెకోవ్; చైనా లీడర్ కాదు.

Share.

About Author

Comments are closed.

scroll