Fake News, Telugu
 

ముస్లిములకి వ్యతిరేకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయలేదు

0

‘మైనారిటీలు షరియా చట్టం కోరుకుంటే దాన్ని అమలు చేస్తున్న దేశానికి వెళ్లిపోవచ్చు; రష్యాకు మైనారిటీలు అక్కర్లేదు, మైనారిటీలకీ రష్యా కావాలంటే మా చట్టాలని అనుసరించాల్సిందే’ అని మైనారిటీలను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు పుతిన్ పలు వ్యాఖ్యలు చేసాడని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వార్తలో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ‘మైనారిటీలు షరియా చట్టం కోరుకుంటే దాన్ని అమలు చేస్తున్న దేశానికి వెళ్లిపోవచ్చు; రష్యాకు మైనారిటీలు అక్కర్లేదు, మైనారిటీలకీ రష్యా కావాలంటే మా చట్టాలని అనుసరించాల్సిందే’ – పుతిన్.

ఫాక్ట్ (నిజం): ఈ వార్త 2014 నుండే ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఐతే ముస్లిములకి వ్యతిరేకంగా పుతిన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి అధికారిక సమాచారం గాని, లేక వార్తా కథనాలు గాని లేవు. 2013లో ఒకసారి ‘రష్యాలో ఉండే ముస్లిములు ఆ దేశ పౌరులేనని, రష్యా వారి ఇల్లు’ అని ముస్లిములకి మద్దతుగా పుతిన్ మాట్లాడాడు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వ్యాఖ్యలకి సంబంధించి గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ముస్లిములని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి అధికారిక సమాచారంగానీ, లేదా వార్తా కథనాలు గానీ లేవు. ఒకవేళ పుతిన్ ఒక మతాన్ని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసుంటే, అన్ని ప్రముఖ వార్తా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్ట్ చేసుండేవి, కాని పుతిన్ ఇలా వ్యాఖ్యానించినట్టు ఎటువంటి కథనాలు లేవు.

2013లో ఒకసారి ఇంటర్ఎత్నిక్ రిలేషన్స్ పై మాట్లాడుతూ ‘రష్యాలో ఉండే ముస్లిములు ఆ దేశ పౌరులేనని, రష్యా వారి ఇల్లు’ అని ముస్లిములకి మద్దతుగా పుతిన్ మాట్లాడాడు.

పుతిన్ ముస్లిములకి వ్యతిరేకంగా మాట్లాడినట్టు ఈ వార్త 2014 వైరల్ అయినప్పుడు snopes అనే ఫాక్ట్ చెకింగ్ సంస్థ ఈ వార్త తప్పని, పుతిన్ అలా అనలేదని చెప్తూ రాసిన కథనం ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి బట్టి, పుతిన్ ముస్లిములకి వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవని చెప్పొచ్చు.

చివరగా, ముస్లిములకి వ్యతిరేకంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ వ్యాఖ్యలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll