Fake News, Telugu
 

మెక్సికో లోని ఒక చమురు క్షేత్రం అగ్ని ప్రమాదం వీడియోని సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడిగా ప్రచారం చేస్తున్నారు

1

ఒక చమురు రిఫైనరీలో పేలుళ్ల కు సంబంధించిన వీడియో ని ఫేస్బుక్ లో పోస్ట్ చేసి, అది ఇటీవల సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడుల వీడియో అని ఆరోపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం. 

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : సెప్టెంబర్ 14న సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడులకు సంబంధించిన వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియో 2012లో మెక్సికో లోని ఒక చమురు క్షేత్రంలో సంభవించిన అగ్ని ప్రమాదానికి సంబంధించినది. కావున, పోస్టులో చేసిన ఆరోపణ తప్పు.  

సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులు సెప్టెంబర్ 14, 2019 న జరిగినట్లుగా ‘The  New York Times’ వారి కథనం ద్వారా తెలిసింది.

పోస్టులో ఉన్న వీడియోని ‘ఇన్విడ్’ ప్లగిన్ లో అప్లోడ్ చేసినపుడు, దానికి సంబంధించిన చాలా కీఫ్రేమ్స్ వచ్చాయి. వాటిని, ‘యాండెక్స్’ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ వీడియో చాలా సంవత్సారాల నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్లుగా తెలిసింది. ఒక సెర్చ్ రిజల్ట్, ఆ వీడియో మెక్సికో లో జరిగిన సంఘటనది గా తెలిపింది. ఆ వీడియో టైటిల్ లో ఉన్న పదాల ఆధారంగా యూట్యూబ్ లో వెతికినప్పుడు, మెక్సికో మీడియా సంస్థ ‘Imagen Noticias’ అదే వీడియో క్లిప్ ఆధారంగా డిసెంబర్ 11, 2012 న ప్రసారం చేసిన ఒక న్యూస్ వీడియో లభించింది. దాంట్లో ఉన్న డెస్క్రిప్షన్ ద్వారా, ఆ ఘటన సెప్టెంబర్ 18, 2012 న మెక్సికో లోని ‘పిమెక్స్ చమురు క్షేత్రం’ లో సంభవించిన అగ్ని ప్రమాదానికి సంబంధించినదిగా తెలిసింది. 

అదే విషయాన్నీ వెల్లడిస్తూ ‘రాయిటర్స్’ వారు సెప్టెంబర్ 19, 2012 న ప్రచురించిన కథనం ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఆ వీడియో సౌదీ అరేబియా చమురు క్షేత్రాలపై జరిగిన డ్రోన్ దాడులకు సంబంధించినది కాదు. అది 2012లో మెక్సికో లోని ఒక చమురు క్షేత్రంలో సంభవించిన అగ్ని ప్రమాదానికి సంబంధించినది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll