Fake News, Telugu
 

ఆ వీడియో తిరుపతి గుడిది కాదు, న్యూయార్క్ లోని శ్రీరంగనాథ స్వామి దేవాలయం గోపురం

1

ఒక గుడి పై భాగంలో ఉన్న బంగారు గోపురానికి సంబంధించిన  వీడియో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి “మనం చూడని చూడలేని , తిరుపతి లోని ఏడుకొండల స్వామి బంగారు గోపురం పైభాగం” అంటూ చాలా మంది ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ : తిరుపతి గుడి పై భాగంలో ఉన్న బంగారు గోపురం వీడియో .

ఫాక్ట్ (నిజం): వీడియోలో కనిపించేది న్యూయార్క్ లోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయం పైభాగంలో ఉన్న బంగారు గోపురం. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.  

పోస్టులో పెట్టిన వీడియోలో బంగారు గోపురాన్ని చూపిస్తూ కొంతమంది వ్యక్తులు స్తోత్రాలు చదవడం వినవచ్చు. ఒక అతను -0:27 నిడివి దగ్గర ‘శ్రీ రంగంలో శ్రీ రంగనాథ స్వామి యొక్క దివ్య గోపుర దర్శనం’ అని అంటాడు. ఆ సమాచారంతో యూట్యూబ్ లో ఆంగ్లంలో మరియు తమిళంలో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. వాటిలో, అదే వీడియోతో ఉన్న రిజల్ట్స్, ఆ వీడియో శ్రీ రంగంలోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయం యొక్క బంగారు గోపురముదని తెలిపాయి. కానీ, సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చిన ఒక వీడియో యొక్క కామెంట్స్ సెక్షన్ లో మాత్రం ఒక వ్యక్తి, చాలా మంది ఆ వీడియోలో ఉన్నది శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయం అని పొరబడ్తున్నారనీ, కానీ వాస్తవానికి అది న్యూయార్క్ లో ఉన్న శ్రీరంగనాథ స్వామి దేవాలయం అని పేర్కొన్నాడు. ఆ సమాచారంతో న్యూయార్క్ లోని దేవాలయం యొక్క గూగుల్ ఫొటోలు వెతికినప్పుడు, ఆ గుడి గోపురానికి సంబంధించిన ఫోటో ఒకటి లభించింది. ఆ ఫోటోనీ మరియు వీడియోలో -0:49 నిడివి దగ్గర కనిపించే ఫ్రేమ్ ని పోల్చినప్పుడు, ఆ రెండు కూడా ఒకేలా ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతే కాదు, వీడియోలో కనిపించే పరిసరాలను, న్యూయార్క్ శ్రీరంగనాథ స్వామి దేవాలయం యొక్క సాటిలైట్ ఇమేజ్ లో కూడా చూడవచ్చు.  

ఆ వీడియో లో ఉన్నది శ్రీరంగంలోని  శ్రీరంగనాథ స్వామి దేవాలయం కాదు, ఎందుకంటే శ్రీరంగంలో ఉన్న దేవాలయం ఫోటో ని మరియు వీడియోలో -0:09 నిడివి దగ్గర కనిపించే దేవాలయం గోపురం ఫ్రేమ్ ని పోల్చినప్పుడు, ఆ రెండింటిలో చాలా తేడాలు కనిపించాయి. ఆ తేడాలను క్రింది కొలేజ్ లో కూడా చూడవచ్చు.

చివరగా, ఆ వీడియో తిరుపతి గుడి కి సంబంధించినది కాదు. అందులో కనిపించేది న్యూయార్క్  లోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయం యొక్క బంగారు గోపురం.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll