Fake News, Telugu
 

2011లో జపాన్ దేశం పై విరుచుకుపడ్డ ‘సునామి’ వీడియోని వరదలతో నిండిపోయిన చైనా అని షేర్ చేస్తున్నారు

0

డ్యామ్ పగలడంతో వరదలతో నిండిపోయిన చైనా, అని షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

       ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: చైనాలో డ్యామ్ పగిలి నీరు వరద లాగా పొర్లుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం):  పోస్టులో షేర్ చేసినది 2011లో జపాన్ దేశంలోని ‘ఇశినోమాకి’ నగరం పై విరుచుకుపడిన ‘సునామి’ కి సంబంధించిందన వీడియో. ఈ వీడియోని ‘Ishinomaki gas Corporation Limited’ అనే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యగి తీసినట్టు విశ్లేషణలో తెలిసింది. ఈ వీడియోకి చైనా దేశానికి ఎలాంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలు కలిగి ఉన్న ఒక  వీడియో ‘William Castronuovo’ అనే యూసర్ యూట్యూబ్ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు జపాన్ దేశంలోని ‘ఇశినోమాకి’ నగరం పై విరుచుకుపడ్డ సునామికి సంబంధించినవి అని ఆ యూసర్ వివరణలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా మరింత సమాచారం కోసం వెతకగా, ఇదే వీడియో ‘FNN311’ అనే యూట్యూబ్ ఛానెల్లో దొరికింది. 2011లో జపాన్ దేశంలో వచ్చిన ‘Great East Japan Earthquake’ కి సంబంధించిన వీడియోలని ప్రత్యేకంగా పొందుపరచడానికి ‘FNN311’ అనే యూట్యూబ్ ఛానల్ ని ‘FUJI’ అనే జపాన్ కి చెందిన వార్తా సంస్థ మొదలుపెట్టింది. ‘11 March 2011’ నాడు జపాన్ దేశంలో వచ్చిన భారీ భూకంపం వల్ల ఆ దేశంలోని ‘ఇశినోమాకి’ అనే నగరం పై భారీ సునామి అలలు విరుచుకుపడ్డాయి, అని ఈ వీడియోలో తెలిపారు. ఈ వీడియోని ‘Ishinomaki gas Corporation Limited’ అనే కంపెనీలో పనిచేస్తున్న ఉద్యగి, తన కంపెనీ మేడపై నుంచి ఈ వీడియో తీసినట్టు వివరణలో తెలిపారు.

ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్ లో వెతకగా, ఇదే వీడియో ఉక్రెయిన్ దేశానికి చెందిన ‘1+1 TV’ ఛానల్ యొక్క యూట్యూబ్ ఛానెల్లో కూడా దొరికింది. వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు జపాన్ దేశంలో విరుచుకుపడిన సునామికి సంబంధించినవని వివరణలో తెలిపారు. ఈ సునామి వల్ల జరిగిన నష్టాన్ని మనం ఈ వీడియోలో కూడా చూడవచ్చు.

పోస్టులో షేర్ చేసిన ఇదే వీడియోని కొందరు ఇదివరకు కేరళ రాష్ట్రంలో పొర్లుతున్న వరదలని, మరికొందరు తాజాగా లావోస్ దేశంలో హైడ్రో పవర్ ప్లాంట్ కూలడం వలన పొంగుతున్న వరదలని షేర్ చేసారు. ‘11 March 2011’ నాడు జపాన్ దేశంలో విరుచుకుపడిన ఈ సునామి వలన వేల మంది చనిపోయారు. ఆ ఘటనకి సంబంధించిన మరింత సమాచారం ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 2011లో జపాన్ దేశం పై విరుచుకుపడ్డ సునామి కి సంబంధించిన వీడియోని చూపిస్తూ డ్యామ్ పగలడంతో వరదలతో నిండిపోయిన చైనా అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll