Fake News, Telugu
 

భగవద్గీత 700 సార్లు చదివానని బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే ఎక్కడా పేర్కొనలేదు

0

ఫేస్బుక్ లో కొంతమంది బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే గుడిలో చీర కట్టుకుని ఉన్న ఫోటోని పెట్టి, భగవద్గీతలో మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయని, అందుకని ఆంగ్లంలో భగవద్గీతని తాను 700 సార్లు చదివానని, దాని వల్ల తన జన్మ ధన్యమైందని థెరిస్సా మే చెప్పినట్లుగా పోస్ట్ లో పేర్కొన్నారు. ఇందులో ఎంత వరకు నిజముందో విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): థెరిస్సా మే తాను భగవద్గీతని 700 సార్లు చదివానని చెప్పింది.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్న చిత్రం 2016లో థెరిస్సా మే భారత దేశ పర్యటనలో భాగంగా బెంగళూరు లోని సోమేశ్వర ఆలయం సందర్శించినప్పటిది. ఆ సందర్భంలో కానీ, వేరే ఇంకే సందర్భంలో కానీ తాను భగవద్గీత చదివినట్లుగా పేర్కొనలేదు. కావున పోస్ట్ లో చేసిన వాఖ్యలు అవాస్తవాలు.

పోస్ట్ లో ఉన్న చిత్రాన్ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది థెరిస్సా మే 2016లో బ్రిటన్ ప్రధానిగా భారత దేశాన్ని అధికారికంగా పర్యటించినప్పుడు, బెంగళూరు లోని హాలాసూరు సోమేశ్వర ఆలయం సందర్శించినప్పటిది అని తెలిసింది. ఆ సందర్భంలో థెరిస్సా మే, తాను  భగవద్గీత గురించి ఎక్కడా ప్రస్తావించలేదు మరియు ఏ వార్తా సంస్థతో కూడా మాట్లాడలేదు. థెరిస్సా మే తాను భగవద్గీతని చదివానని వేరే ఏ సందర్భంలో అయినా పేర్కొన్నదా అని వెతికినప్పుడు, అలా అన్నట్లుగా ఎక్కడా ఎటువంటి సమాచారం లభించలేదు. థెరిస్సా మే ఒక సందర్భంలో, తాను హారి పోటర్ అభిమానినని, దానికి సంబంధించిన అన్ని పుస్తకాలు చదివానని వెల్లడించింది అని తెలిసింది.

చివరగా, బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే తాను భగవద్గీతను 700 సార్లు చదివాను అని ఎక్కడా పేర్కొనలేదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll