Fake News, Telugu
 

‘7100 ఎకరాల భారత దేశ భూభాగాన్ని కబ్జా చేసిన నేపాల్’ అనే శీర్షికతో ఉన్న ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ 2018 లో ప్రచురితమైంది

0

‘7100 ఎకరాల భారత దేశం భూభాగాన్ని కబ్జా చేసిన నేపాల్’ అనే శీర్షికతో ఉన్న న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ను, ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించిన రిపోర్టుగా షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో బాగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల 7100 ఎకరాల భారత భూభాగాన్ని కబ్జా చేసిన నేపాల్.

ఫాక్ట్ (నిజం): ‘7100 ఎకరాల భారత భూభాగాన్ని కబ్జా చేసిన నేపాల్’ అనే టైటిల్‌తో దైనిక్ భాస్కర్ ప్రచురించిన ఆర్టికల్ మూడేళ్ళ క్రితంది. 2018లో ఈ వార్త ప్రచురించారు, ఇటీవల కాదు. 7100 ఎకరాల భారత భూభాగాన్ని కబ్జా చేసిన నేపాల్ అంటూ ఇటీవల ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్ లభించలేదు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.       

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, దైనిక్ భాస్కర్ వారి న్యూస్ ఆర్టికల్ లభించింది. ఆ ఆర్టికల్‌లో నిజంగానే ‘7100 ఎకరాల భారత భూభాగాన్ని కబ్జా చేసిన నేపాల్’ అని ఉంది. కానీ. ఈ ఆర్టికల్ 2018లో రాసింది, 2021లో కాదు.  

బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో నేపాల్ సుమారు 7100 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుందని ఆర్టికల్ ద్వారా అంటున్నారు. వాల్మీకినగర్ లోని సుస్తా, వాల్మీకి టైగర్ రిజర్వ్ అడవులు మరియు గోవర్ద్నాలోని శివాలిక్ కొండలతో సహా కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా కబ్జా జరుగుతున్నట్టు తెలిపారు. దీనిని జనసత్తా వారు కూడా రిపోర్ట్ చేసారు.

అయితే భారత ప్రభుత్వం నుండి ఈ న్యూస్ రిపోర్టుకి సంబంధించి అప్పట్లో అధికారికంగా సమాధానం వచ్చినట్టు ఎటువంటి సమాచారం మాకు లభించలేదు. 2020లో మాత్రం, నేపాల్ ప్రభుత్వం సవరించిన మ్యాప్ ను రిలీజ్ చేసి, అందులో భారత భూభాగాన్ని కలిపినప్పుడు, భారత విదేశీ మంత్రిత్వ శాఖ వారు దీన్ని ఖండించారు. ఇటీవల, నేపాల్ మరొకసారి, ఉత్తరాఖండ్ లోని మూడు గ్రామాలు తమవే అని అన్నదని పత్రికలు పేర్కొన్నాయి.

చివరగా, ‘7100 ఎకరాల భారత దేశం భూభాగాన్ని కబ్జా చేసిన నేపాల్’ అనే శీర్షికతో ఉన్న ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ 2018 లో ప్రచురితమైంది.

Share.

About Author

Comments are closed.

scroll