Fake News, Telugu
 

రెండేళ్ళ క్రితం ఫోటోలు పెట్టి ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ బిర్యానీ అమ్ముకుంటున్నాడని తప్పుగా ప్రచారం చేస్తున్నారు

0

జనసేన పార్టీ నేత కళ్యాణ్ దిలీప్ సుంకర తమ పార్టీ ఎన్నికల్లో ఓడిపోవడంతో హైదరాబాద్ రోడ్లపై బిర్యానీ అమ్ముకుంటున్నాడు అని చెప్తూ కొన్ని ఫోటోలతో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): మొన్నటి వరకు జనసేన మీడియా అధికార ప్రతినిధి గా ఉండి, ఇపుడు ఏకంగా హైదరాబాద్ రోడ్ల పై బిర్యానీ అమ్ముకుంటున్న కళ్యాణ్ దిలీప్ సుంకర.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటోలు ఇప్పటివి కాదు. ఆ ఫోటోలను కళ్యాణ్ దిలీప్ తన ఫేస్బుక్ అకౌంట్ లో 8 జూన్ 2017 న పోస్ట్ చేసాడు. కావున పాత ఫోటోలు పెట్టి తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

పోస్ట్ లోని ఫోటోల కోసం కళ్యాణ్ దిలీప్ ఫేస్బుక్ అకౌంట్ లో వెతకగా, తన అకౌంట్ లో ఆ ఫోటోలు దొరుకుతాయి. ఆ ఫోటోల అప్లోడ్ డేట్ చూస్తే 8 జూన్, 2017 అని ఉంటుంది. కావున పోస్ట్ లోని ఫోటోలు ఇప్పటి ఫోటోలు కావు, రెండేళ్ళ క్రితం తీసిన ఫోటోలు. ఈ ఫోటోలు 2017 లో తాను తక్కువ పెట్టుబడి తో సంపాదించొచ్చు అని చెప్పడానికి బిర్యానీ అమ్మినప్పడివి.

చివరగా, రెండేళ్ళ క్రితం ఫోటోలు పెట్టి ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ బిర్యానీ అమ్ముకుంటున్నాడని తప్పుగా ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll