Fake News, Telugu
 

ఫోటో లో తెరాస నాయకులు ఉగాది పచ్చడి త్రాగుతున్నరు

0

చాలా మంది ఫేస్బుక్ యూజర్స్ తెరాస నాయకులు పార్టీ చేసుకుంటున్నట్లుగా ఉన్న ఒక ఫోటోతో కూడిన పోస్ట్ ని షేర్ చేస్తున్నారు. అందులో ఎంతవరకు నిజముందో ఓసారి విశ్లేషిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు   

క్లెయిమ్ (దావా): ఒక వైపు విద్యార్థులు చనిపోతుంటే, మరోవైపు TRS నాయకులు మద్యం సేవిస్తూ పార్టీ చేసుకున్నారు  

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్నది తెరాస నాయకులు ఉగాది రోజున పచ్చడి త్రాగుతున్న ఫోటో. కావున తప్పుగా పోస్ట్ పెట్టి ప్రక్కద్రోవ పట్టిస్తున్నారు.  

పోస్ట్ లో తెరాస నాయకులు ఉన్న ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది నమస్తే తెలంగాణ వార్తా సంస్థ వారు ఏప్రిల్ 6, 2019 న ప్రచురించిన కథనంలో లభిస్తుంది. దాని ఆధారంగా, సూర్యాపేటలోని మంత్రి జగదీశ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, నల్గొండ లోక్‌సభ టీఆర్‌ఎస్ అభ్యర్థి వేమిరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారని , ఆ సందర్భంగా ఆయన ఉగాది పచ్చడిని స్వయంగా తయారు చేసి అతిథులకు పంచారని తెలుస్తుంది. ఇది కూడా తెలంగాణ లో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ప్రకటించే కంటే ముందు జరిగినదని స్పష్టంగా చెప్పొచ్చు.

చివరగా, ఫోటో లో తెరాస నాయకులు ఉగాది పచ్చడి సేవిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll