Fake News, Telugu
 

సంతానం కలగకుండా చేసే పదార్థాలు ముస్లిం వ్యక్తి భోజనంలో కలపలేదు. అసలు అలాంటి పిల్స్ లేవు.

0

శ్రీలంకలోని ఒక రెస్టారంట్ లో సంతానం కలగకుండా ఉండే పదార్థాలను రెస్టారెంట్ కు భోజనం కోసం వస్తున్న బౌద్దులకు ఆ రెస్టారంట్ యజమాని అయిన ఒక ముస్లిం వ్యక్తి పెడుతున్నాడని ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): ఫాసిత్ అనే మస్లిం వ్యక్తి గత కొంత కాలంగా తన రెస్టారెంట్ కు భోజనం కోసం వస్తున్న బౌద్దులకు తినే పదార్థాల్లో సంతానం కలగకుండా చేసే మందులను కలుపుతున్నాడని నిర్దారణ కావడంతో శ్రీలంక పోలీసులు రెడ్ హాండెడ్ గా తనని అరెస్టు చేసారు. ఈ ఘోరం బౌద్దులకు తెలియడంతో వారు దొరికిన ముస్లిం ను దొరికినట్లు బాదడం మొదలు పెట్టారు. వారి ఇండ్లను ద్వంసం చేసేసారు. గత వారం రోజులుగా శ్రీలంకలో రణరంగమే జరుగుతోంది. 

ఫాక్ట్ (నిజం): 2018 లో ఫాసిత్ సంతానం కలగకుండా భోజనంలో పదార్థాలు కలిపాడనే ఆరోపణ మీద బౌద్ధులు ముస్లింల పై దాడి చేసారనేది వాస్తవమే కానీ నిజానికి ఫాసిత్ సంతానం కలగకుండా ఎటువంటి పదార్థాలు భోజనంలో కలపలేదు. అది ఒక పుకారుతో మొదలైన గొడవ. అసలు పూర్తిగా సంతానం కలగకుండా చేసే పదార్థాలు (పిల్స్) లేవని శ్రీలంక లోని WHO ప్రతినిధి ఈ విషయం పై వివరణ ఇచ్చారు. కావున పాత ఫేక్ న్యూస్ ని మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేస్తూన్నారు. 

పోస్ట్ లోని విషయంపై గూగుల్ లో ‘Ampara Sterilization pills’ అని వెతకగా ఇదే విషయం పై 2018 లో వివిధ వార్తాపత్రికలు రాసిన ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా ఇది గత వారం జరగలేదు, గత సంవత్సరంలో జరిగింది. Sunday Observer ఆర్టికల్ ప్రకారం, ఒక వ్యక్తి రెస్టారంట్ లో భోజనం చేస్తుండగా తనకు భోజనంలో ఎదో తెల్లని పదార్థాలు కనపడ్డాయి. దాంతో అతను వేరే వాళ్ళకు ఫోన్ చేసాడు. అక్కడికి చేరుకున్న మిగితా వాళ్ళు ఫార్సిత్ ని భోజనంలో సంతానం కలగకుండా చేసే పదార్థాలు (పిల్స్)  కలిపాడని ఒప్పుకోమని  బెదిరించడంతో, భయంతో తను కలిపడాని ఒప్పుకున్నాడు. కానీ తర్వాత ప్రభుత్వం నిర్వహించిన ఇన్వెస్టిగేషన్ లో భోజనం లో దొరికింది కేవలం పిండి ముద్దలేనని తెలిసింది.

అలానే, శ్రీలంక లోని WHO ప్రతినిధి అసలు పూర్తిగా సంతానం కలగకుండా చేసే పదార్థాలు (పిల్స్) లేవని, అలాంటివి భోజనం లో కలిపారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఈ విషయం మీద స్పందించారు.

స్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ లో వెతికితే, అది 2017 లో జరిగిన సంఘటనగా తెలుస్తుంది. కావున పోస్ట్ చేసిన ఫోటోకి, రెస్టారంట్ లో జరిగిన సంఘటనకి ఎటువంటి సంబంధం లేదు.

చివరగా, భోజనంలో పూర్తిగా సంతానం కలగకుండా చేసే పదార్థాలు కలపలేదు. అసలు అలాంటి పిల్స్ లేవు.

Share.

About Author

Comments are closed.

scroll