Fake News, Telugu
 

ఫోటోలో ఆశా వర్కర్లను అరెస్ట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులే. ఆ లోగో విశాఖపట్నం పోలీసులది

0

ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న ఫోటోలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదంటూ ఉన్న ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఒకసారి తెలంగాణ ఆశా వర్కర్ల నిరసన ఫోటోని తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో జరిగినట్టు వైరల్ చేసారు (అప్పుడు FACTLY రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్ ఇక్కడ చదవచ్చు). కావున, ఇది కూడా అలాంటిదే అని పోస్ట్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వేరే రాష్ట్రపు ఫోటో పెట్టి, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకుంటున్నారని అంటున్నారు.  

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటో లో ఉన్నది ఆంధ్ర ప్రదేశ్ పోలీసులే. ఫోటోలో పోలీస్ డ్రెస్ పై ఉన్నది విశాఖపట్నం పోలీస్ లోగో. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని ఫోటోని గూగుల్ రివర్స్ సెర్చ్ లో వెతకగా, ‘CPIM-Andhra Pradesh’అనే ఫేస్బుక్ పేజీ అదే ఫోటో పెట్టి, “ విశాఖపట్నంలో దారుణం. వేతనాలు చెల్లించాలని ఆందోళన చేసిన ఆశా కార్యకర్తలపై పబ్లిక్ లో పోలీసులు పైశాచికం” అని పోస్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ఆ వివరాలతో గూగుల్ లో వెతకగా, ‘ఈనాడు’ వెబ్ సైట్ లో ఈ ఆందోళన గురించి ప్రచురించన ఆర్టికల్ దొరుకుతుంది. ‘ఆశా వర్కర్లకు ఈ ఏడాది జనవరి నుంచి పేరుకున్న గౌరవ వేతనం, పారితోషికాల బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సోమవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు’ అని ఆ ఆర్టికల్ లో ఉంటుంది.

కానీ, కొందరు పోస్ట్ లోని ఫోటోలో ఉన్నది ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదని, వాళ్ళు వేసుకున్న డ్రెస్ మీద వేరే రాష్ట్ర పోలీసు లోగో ఉందని వాదిస్తున్నారు. కావున, ఆ లోగో కోసం విశాఖపట్నం పోలీసు వెబ్ సైట్ లో వెతకగా, అది విశాఖపట్నం పోలీసు లోగో అని తెలుస్తుంది. ఒక వైపు ఆంధ్రప్రదేశ్ పోలీసు లోగో ఉంటే మరో వైపు విశాఖపట్నం పోలీసు లోగో ఉన్నట్టు ‘ఈనాడు’ లో ఉన్న ఫోటోలో కూడా చూడవచ్చు. అంతేకాదు, ఈ ఆందోళనకి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, ఫోటోలో ఆశా వర్కర్లను అరెస్ట్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ పోలీసులే. ఆ లోగో విశాఖపట్నం పోలీసులది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll