Fake News, Telugu
 

అది G7 సమ్మిట్ సందర్భంలో మోడీ-ట్రంప్ కి మధ్య జరిగిన ‘ద్వైపాక్షిక’ భేటీ ఫోటో. అందులో కనిపించే వ్యక్తులు భారత్ మరియు అమెరికా దేశ ప్రతినిధులు

0

ఒక సమావేశంలో మోడీ సభ మధ్యలో  కూర్చుని ప్రసంగిస్తుంటే ట్రంప్ సహా మరి కొంత మంది వ్యక్తుల వింటున్నట్లుగా ఉన్న ఫోటో ని ఫేస్బుక్ లో పోస్టు చేసి “చెప్పేది #మోదీజీ.. వినేది ప్రపంచ అగ్రదేశాలు (#G7)” అని చెప్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: G7 సమావేశంలో మోడీ సభ మధ్యలో కూర్చుని ప్రసంగిస్తుంటే ఇతర ప్రపంచ దేశాల నేతలు వింటున్నట్టు ఫొటోలో చూడవచ్చు.  

ఫాక్ట్ (నిజం): ఫోటో G7 సమ్మిట్ సందర్భంలో మోడీ-ట్రంప్ కి మధ్య జరిగిన ‘ద్వైపాక్షిక’ భేటీ కి సంబంధించింది. అందులో కనిపించే ఇతర వ్యక్తులు ప్రపంచ దేశాల నేతలు కారు. వారు ఇరు దేశాల ( భారత్ మరియు అమెరికా) ప్రతినిధులు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టులో పెట్టిన ఫోటోని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్  చేయగా, అది డోనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ లో పెట్టిన ఒక ట్వీట్ లో లభించింది. ఆ ట్వీట్ లో ట్రంప్ ఫ్రాన్స్ లో నిర్వహించిన G7 సమావేశం సందర్భంగా మోడీని కలిసినట్లుగా పేర్కొన్నారు.

యూట్యూబ్ లో ‘G7 Modi Trump meeting’ అనే కీవర్డ్స్ తో వెతికినప్పుడు వచ్చిన సెర్చ్ రిజల్ట్స్ ద్వారా, వారి ఇద్దరి మధ్యలో G7 సమ్మిట్ సందర్భంలో జరిగింది భారత్-అమెరికా ‘ద్వైపాక్షిక’ భేటీ అని తెలిసింది. వాటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఆ సమావేశం వీడియోని చూసినట్లయితే, ఆ భేటీలో కేవలం భారత్ మరియు అమెరికా జెండాలు మాత్రమే కనిపిస్తాయి. వేరే ఏ ఇతర దేశ జెండా కూడా కనిపించదు. అనగా, అది భారత్ మరియు అమెరికా దేశాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక భేటీ అని సంకేతం.

పోస్టులో పెట్టిన ఫొటోలో ఉన్న వ్యక్తులు మరియు వారు కూర్చున్న క్రమము మోడీ-ట్రంప్ సమావేశానికి సంబంధించిన వీడియోలో కూడా అలానే ఉన్నట్లుగా చూడవచ్చు.

చివరగా, పోస్టులో పెట్టిన ఫోటో G7 సమ్మిట్ సందర్భంలో మోడీ-ట్రంప్ కి మధ్య జరిగిన ‘ద్వైపాక్షిక’ భేటీ ది. అందులో కనిపించే వ్యక్తులు ప్రపంచ దేశాల నేతలు కారు. వారు భారత్ మరియు అమెరికా దేశ ప్రతినిధులు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll