Fake News, Telugu
 

తిరుపతిలో ఉన్నది ఫారెస్ట్ శాఖకి సంబంధించిన వాచ్ టవర్ బిల్డింగ్, యేసు మందిరం (చర్చి) కాదు

0

‘తిరుపతి లో ఏడుకొండలపై యేసు మందిరాలు’ అని చెప్తూ ఒక ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఫోటోలో ఉన్నది తిరుపతి లో ఏడుకొండలపై ఉన్న యేసు మందిరం (చర్చి).

ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్నది చర్చి కాదు. అది ఫారెస్ట్ శాఖకి సంబంధించిన వాచ్ టవర్ బిల్డింగ్. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో వెతకగా, ఈ విషయం పై ‘Bharat Today’ వారు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ వీడియో ఆధారంగా, ఫోటోలో ఉన్నది ఫారెస్ట్ శాఖకి సంబంధించిన వాచ్ టవర్ బిల్డింగ్ అని తెలుస్తుంది. ఫోటోలో క్రిస్టియన్ ‘క్రాస్’ సింబల్ లాగా కనిపిస్తున్నది సీసీటీవీ కెమెరా పెట్టి ఉన్న ఒక పోల్ అని ఆ వీడియోలో చూడవచ్చు.

చివరగా, ఫోటోలో ఉన్నది ఫారెస్ట్ శాఖకి సంబంధించిన వాచ్ టవర్ బిల్డింగ్, యేసు మందిరం (చర్చి) కాదు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll