Fake News, Telugu
 

ప్రధాన మంత్రి విదేశీ యాత్రలలో విమానాల మీద చేసిన ఖర్చు సుమారు 2000 కోట్లు, 270 కోట్లు కాదు

0

మోడీ మరియు చంద్రబాబుల యొక్క విమాన ఖర్చులను పోలుస్తూ ఒక ఫోటోని చాలా మంది ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. ఇచ్చిన ఖర్చులలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): భారత ప్రధాని విమాన ఖర్చు 270 కోట్లు. అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రముఖ్యమంత్రి విమాన ఖర్చు 600 కోట్లు.

ఫాక్ట్ (నిజం): చంద్రబాబు నాయుడు ఖర్చు ఎక్కడా కూడా వెలువడలేదు. కానీ మోడీ ఇతర దేశాలకు వెళ్ళినప్పటి విమన ఖర్చు రాజ్య సభ లో ప్రకటించారు. దాని ప్రకారం మోడీ విమానాల మీద చేసిన ఖర్చు 2012.42 కోట్లు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం. 

విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సహాయక మంత్రి వీ కే సింగ్ గారు రాజ్య సభ లో ఒక ప్రశ్న కి బదిలిస్తూ మోడీ విదేశీ ప్రయాణాల ఖర్చుని ప్రకటించారు. ఆ సమాధానం ప్రకారం గత ఐదేళ్ళలో మోడీ విమాన ఖర్చు 2012 .42 కోట్లు. దాంట్లో 1583.18 కోట్లు ప్రధాని విమానం యొక్క నిర్వహణకి ఖర్చు చేస్తే మిగితా 429.24 కోట్లు ఛార్టర్డ్ విమనాలకి ఖర్చు చేసారు.

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు విమాన ఖర్చు గురించి గూగుల్ లో ‘Chandrababu airplane costs’ అని వెతకగా అలాంటి సమాచారం ఎక్కడ కూడా ప్రకటించలేదని తెలుస్తుంది. అక్కడే సెర్చ్ రిజల్ట్స్ లో చూస్తే ఈ విషయం మీద డెక్కన్ క్రానికల్ ప్రచురించిన ఆర్టికల్ ఒకటి కనిపిస్తుంది. దాని ప్రకారం చంద్రబాబు విదేశీ ప్రయాణాల మీద ఒక వ్యక్తి ఆర్.టీ.ఐ వేయగా సమాచారం ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిచందని తెలుస్తుంది. కావున పోస్ట్ లో చంద్రబాబు ఖర్చు అని రాసిన సంఖ్య కి ఎటువంటి ఆధారం లేదు. పోస్ట్ లో చెప్పిన ఒకటి తప్పు మరొకదానికి ఆధారం లేదు.

చివరగా, ప్రధాన మంత్రి విదేశీ యాత్రలలో విమానాల మీద చేసిన ఖర్చు సుమారు 2000 కోట్లు, 270 కోట్లు కాదు.

Share.

About Author

Comments are closed.

scroll