Fake News, Telugu
 

పుల్వామా లో దాడి చేసిన ఉగ్రవాదితో రాహుల్ గాంధీ ఫోటో దిగలేదు . అది మార్ఫింగ్ చేసిన ఫోటో

0

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా లో జరిగిన ఉగ్రవాద దాడిలో జవాన్ల మరణానికి కారణమైన ఉగ్రవాది తో రాహుల్ గాంధీ ఫోటో ఒకటి ఫేస్బుక్ లో నాగరాజు దొడ్డ అనే వ్యక్తి పోస్ట్ చేసాడు. వైరల్ అవుతున్న ఆ ఫోటోలో నిజమెంతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.

క్లెయిమ్ (దావా): ఉగ్రవాది తో రాహుల్ గాంధీ.

ఫాక్ట్ (నిజం): 2014 లో రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ లోని హాజీ వారిస్ అలీ షా దర్గాకి వెళ్ళిన సంధర్భంలో తీసిన ఫోటోని ఫోటోషాప్ సాఫ్ట్ వేర్ సహాయంతో మార్చేసారు. అసలు ఫోటోలో ఉన్న కాంగ్రెస్ లీడర్ మాజీ మంత్రి జితిన్ ప్రసాద ముఖాన్ని తీసి ఉగ్రవాది ముఖాన్ని పెట్టారు.


చివరగా, ఫేస్బుక్ లో వైరల్ అవుతున్న ఫోటోలో ఎలాంటి నిజము లేదు. అది ఎడిట్ చేయబడిన ఫేక్ ఫోటో.

Share.

About Author

Comments are closed.

scroll