తాజా లాక్ డౌన్ 4.0 లో వివిధ షాపులు తెరిచే రోజులు మరియు సమయాలు అని చెప్తూ, ఒక షెడ్యూల్ తో కూడిన పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: లాక్ డౌన్ 4.0 లో వివిధ షాపులు తెరిచే రోజులు మరియు సమయాల షెడ్యూల్ రిలీజ్ చేసిన ప్రభుత్వం.
ఫాక్ట్ (నిజం): 17 మార్చి 2020 న కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన మార్గదర్శకాలలో పోస్టులో ఇచ్చిన షెడ్యూల్ లేదు. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగితా ప్రదేశాల్లో అన్నీ షాపులు (షాపింగ్ మాల్స్ మరికొన్ని తప్ప) తెరవచ్చు అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే కొన్ని పట్టణాలలో మాత్రం దినం తప్పి దినం వేరు వేరు షాపులను తెరవాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్టులో ఇచ్చిన షెడ్యూల్ గురించి 17 మార్చి 2020 న కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన మార్గదర్శకాలలో వెతకగా, అటువంటి షెడ్యూల్ ఏదీ కూడా కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదని తెలుస్తుంది. కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగితా ప్రదేశాల్లో అన్నీ షాపులు (షాపింగ్ మాల్స్ మరికొన్ని తప్ప) తెరవచ్చు అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సామాజిక దూరం పాటించడం కోసం షాపులు మరియు మార్కెట్ల సమయాలు విభజించమని కోరింది. అంతేకాని, పోస్టులో ఇచ్చిన షెడ్యూల్ ఇవ్వలేదు.
అయితే కొన్ని సిటీలలో మాత్రం దినం తప్పి దినం వేరు వేరు షాపులను తెరవాలని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నట్టు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. తెలంగాణలో కూడా కంటైన్మెంట్ జోన్ల మినహా మిగితా ప్రదేశాల్లో అన్నీ షాపులు తెరవడానికి అనుమతి ఇచ్చారు. అయితే, జీహెచఎంసీ (హైదరాబాద్)పరిధిలో మాత్రం పక్క-పక్కన ఉన్న షాపులు దినం తప్పి దినం తెరవాలని చెప్పినట్టు తాజాగా రిలీజ్ చేసిన జీఓ లో చూడవొచ్చు. అంతేకాని, పోస్టులో ఇచ్చిన షెడ్యూల్ కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినట్టు మాత్రం ఎక్కడా కూడా సమాచారం లేదు.
చివరగా, పోస్టులో ఇచ్చిన షాపుల షెడ్యూల్ ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయలేదు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?