Fake News, Telugu
 

గాంధీ హాస్పిటల్ లో విమానం కూలిపోలేదు. వీడియోలో ఉన్నది ఒక మాక్ డ్రిల్.

0

గాంధీ హాస్పిటల్ లో విమానం కూలిపోయింది అంటూ ఒక వీడియోతో కూడిన పోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): గాంధీ హాస్పిటల్ లో కూలిన విమానం.    

ఫాక్ట్ (నిజం): వీడియోలో విమానం కూలిపోయినట్టు చుపెట్టినది కేవలం ఒక మాక్ డ్రిల్ మాత్రమే. గాంధీ హాస్పిటల్ లో ఎటువంటి విమానం కూలిపోలేదు. కావున పోస్ట్ లో ఒక మాక్ డ్రిల్ చూపెడుతూ, నిజంగా విమానం కూలిపోయిందని చెప్పి ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.    

పోస్ట్ లోని విషయం గురించి గూగుల్ లో ‘గాంధీ హాస్పిటల్ లో కూలిన విమానం’ అని వెతకగా, ఈ విషయం పై వార్తా సంస్థలు రాసిన ఆర్టికల్స్ వస్తాయి. సాక్షి వార్తాసంస్థ వారి వెబ్ సైట్ లో పెట్టిన ఫోటోల ప్రకారం వీడియోలో చూపెట్టింది కేవలం మాక్ డ్రిల్ మాత్రమేనని తెలుస్తుంది. నిజంగా గాంధీ హాస్పిటల్ లో ఎటువంటి విమానం కూలిపోలేదు. గాంధీ మెడికల్ కాలేజీ విద్యార్థులు నిర్వహిస్తున్న సైన్స్ మేళలో భాగంగా డీఆర్ఎఫ్ (డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్) వారి ఆధ్వర్యంలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించినట్టు తెలుస్తుంది. ఈ మోక్ డ్రిల్ పై ఈనాడు మరియు మన తెలంగాణ వారు కూడా ఆర్టికల్స్ ప్రచురించారు.

చివరగా, గాంధీ హాస్పిటల్ లో విమానం కూలిపోలేదు. వీడియోలో ఉన్నది ఒక మాక్ డ్రిల్.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll