“నేను ప్రపంచ నలుమూలల నుండి రాజ్యాంగాలను చదివాను, కానీ బాబా సాహెబ్ రచించిన భారత రాజ్యాంగంతో ఎవరూ పోటీ పడలేరు” అని UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నాడని ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: “నేను ప్రపంచ నలుమూలల నుండి రాజ్యాంగాలను చదివాను, కానీ బాబా సాహెబ్ రచించిన భారత రాజ్యాంగంతో ఎవరూ పోటీ పడలేరు” అని UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నాడు.
ఫాక్ట్: “నేను ప్రపంచ నలుమూలల నుండి రాజ్యాంగాలను చదివాను, కానీ బాబా సాహెబ్ రచించిన భారత రాజ్యాంగంతో ఎవరూ పోటీ పడలేరు” అని UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నట్టు ఆధారాలు దొరకలేదు. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ రూపొందించడంలో భారతీయ విద్యావేత్త హంసా జీవరాజ్ మెహతా పోషించిన పాత్రను UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రశంసించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్‌లో మెహతా సభ్యుడు కూడా. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.
పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ భారత రాజ్యాంగం గురించి అలా అన్నాడని ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అటువంటి వ్యాఖ్యలు చేసుంటే అన్నీ ప్రముఖ వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి.
UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ సోషల్ మీడియా అకౌంట్స్‌లో – ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ – కూడా భారత రాజ్యాంగం గురించి అలా అన్నాడని లేదు.
యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ రూపొందించడంలో భారతీయ విద్యావేత్త హంసా జీవరాజ్ మెహతా పోషించిన పాత్రను UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రశంసించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ పరిషత్‌లో మెహతా సభ్యుడు కూడా. కానీ, ఆంటోనియో గుటెర్రెస్ భారత రాజ్యాంగంపై పోస్టులో చెప్పినట్టు వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు.

చివరగా, “నేను ప్రపంచ నలుమూలల నుండి రాజ్యాంగాలను చదివాను, కానీ బాబా సాహెబ్ రచించిన భారత రాజ్యాంగంతో ఎవరూ పోటీ పడలేరు” అని UN సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ అన్నట్టు ఆధారాలు లేవు.