Fake News, Telugu
 

వైస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను గతంలో ముస్లింలు ఘెరావ్ చేసిన దృశ్యాలను ఇటీవల జరిగిన ఘటనగా షేర్ చేస్తున్నారు

0

వైస్సార్సీపీ పార్టీ సర్కారు మూడేళ్ల పాలన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ‘గడప గడపకు వెళ్ళబోయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ని తరిమి కొట్టిన ముస్లిం సోదరులు, నెల్లూరు ప్రజలు’ అంటూ వైస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను ముస్లింలు ఘెరావ్ చేసిన వీడియోను షేర్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుంది, ఈ వీడియోను ఇటీవల జరిగిన సంఘటనగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: ఇటీవల వైస్సార్సీపీ మ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను ముస్లింలు ఘెరావ్ చేసిన వీడియో.

ఫాక్ట్ (నిజం):  ఈ దృశ్యాలు ఇటీవల జరిగిన ఘటనలకు సంబంధించినవి కావు. ఫిబ్రవరి 2020లో మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరులో పర్యటిస్తున్న అనిల్ కుమార్ యాదవ్‌ను, CAA అంశంపై తన వైఖరి తెలపాలంటూ ముస్లింలు ఘెరావ్ చేసారు, ఈ దృశ్యాలు ఆ ఘటనకు సంబంధించినవి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వైరల్ వీడియోలో చూపిస్తున్నట్టు వైస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను ముస్లింలు ఘెరావ్ చేసిన విషయం నిజమే అయినప్పటికీ, ఈ ఘటన ఈ మధ్యకాలంలో జరిగింది కాదు. ఈ దృశ్యాలు 2020లో జరిగిన  సంఘటనకు సంబంధించినవి.

వైరల్ వీడియోకు సంబంధించి సమాచారం కోసం గూగుల్‌లో వెతకగా, ఇవే దృశ్యాలను 2020లో రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఈ కథనాల ప్రకారం ఫిబ్రవరి 2020లో మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరులో పర్యటిస్తున్న అనిల్ కుమార్ యాదవ్‌ను, CAA అంశంపై తన వైఖరి తెలపాలంటూ ముస్లింలు ఘెరావ్ చేసారు. వైరల్ అవుతున్న దృశ్యాలు ఈ ఘటనకు సంబంధించినవే. అప్పట్లో ఈ దృశ్యాలను షేర్ చేసిన పలు కథనాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే ఈ దృశ్యాలను ఇటీవల జరిగిన సంఘటనగా పలు తెలుగు వార్తా సంస్థలు (ఇక్కడ మరియు ఇక్కడ) ప్రసారం చేయడంతో ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా వైస్సార్సీపీ ప్రారంభించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైస్సార్సీపీ నేతలకు ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతుందని పలు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఐతే ఈ కార్యక్రమంలో ముస్లింలు అనిల్ కుమార్ యాదవ్‌ను ఘెరావ్ చేసినట్టు మాత్రం ఎటువంటి కథనాలు లేవు.

చివరగా, వైస్సార్సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను గతంలో ముస్లింలు ఘెరావ్ చేసిన దృశ్యాలను ఇటీవల జరిగిన ఘటనగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll