Fake News, Telugu
 

2014 నాటి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడికి వీడ్కోలు పలికిన ఫోటోను ఇప్పుడు షేర్ చేస్తున్నారు.

0

తన దేశ ప్రజలను రక్షించడానికి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యుద్ధంలోకి దిగుతున్న తన కొడుకును ఆశీర్వదించాడు. మన దేశంలో ఎంత మంది నాయకుల పిల్లలు సైన్యంలో ఉన్నారు? యుద్ధ సమయంలో తమ కొడుకులను ఎంతమంది యుద్ధానికి పంపగలరు? అని ప్రశ్నిస్తూ ఒక పోస్టు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. దీని వెనుక ఎంత వాస్తవముందో ఇప్పుడు చూద్దాం. 

క్లెయిమ్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు 2023లో జరుగుతున్న యుద్ధంలోకి దిగుతున్న తన కొడుకును ఆశీర్వదించాడు.

ఫాక్ట్ (నిజం): తొమ్మిదేళ్ల క్రితం 2014లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరియు అతని భార్య సారా తమ చిన్న కుమారుడు అవ్నర్‌కు వీడ్కోలు పలికిన ఫోటో ఇది. ఈ ఫోటో ఇప్పటిది కాదు. కావున, ఈ పోస్టులోని క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. 

ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా ఇంటర్నెట్లో వెతకగా, ఈ ఫోటో దాదాపు తొమ్మిదేళ్ల క్రితం 2014లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరియు అతని భార్య సారా తమ చిన్న కుమారుడు అవ్నర్‌కు ఆర్మీ శిక్షణ కోసం వెళ్తున్నప్పుడు వీడ్కోలు పలుకుతున్న చిత్రం అని వార్తా పత్రికల ద్వారా తెలిసింది (ఇక్కడ మరియు ఇక్కడ).  అవ్నర్ ఇజ్రాయెల్  డిఫెన్సె ఫోర్సెస్ (IDF)  యొక్క కంబాట్ ఇంటెలిజెన్స్ కలెక్షన్ కార్ప్స్‌లో చేరడం ద్వారా తన తప్పనిసరి మూడు సంవత్సరాల ఆర్మీ సేవను 2014లో ప్రారంభించాడు.

“తమ కొడుకు సైన్యంలోకి వెళ్లడాన్ని చూసే ప్రతి తల్లి మరియు తండ్రిలాగే మేము కూడా కదిలిపోయాము. రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకోమని మరియు తనను తాను చూసుకోవాలని నేను అవ్నర్‌కు చెప్పాను.” అని అప్పుడు నెతన్యాహు మీడియాకు తెలిపారు. ఇజ్రాయెల్ మరియు పాలస్తీనియన్ల మధ్య జరుగుతున్న ప్రస్తుత పరిణామాల సందర్భంలో ప్రధాని కుమారుడు సైనిక సేవలో చేరినట్లు దీన్ని షేర్ చేస్తున్నారు.

చివరిగా, 2014 నాటి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన కుమారుడికి వీడ్కోలు పలికిన ఫోటోను ఇప్పుడు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll