Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ రిస్క్ ని లెక్కించడానికి ఉపయోగించిన సూత్రానికి శాస్త్రీయ ఆధారాలు లేవు

0

‘రిస్క్ ఆఫ్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అఫ్ కోవిడ్-19’ అనే టైటిల్ తో ఉన్న ఒక ఇన్ఫోగ్రాఫ్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ఇన్ఫోగ్రాఫ్ లో తెలంగాణా రాష్ట్రం లో కోవిడ్-19  ట్రాన్స్మిషన్  రిస్క్ 122% అని ఉంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: వివిధ రాష్ట్రాల్లో కోవిడ్-19 కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ రిస్క్ శాతాలు. తెలంగాణా రాష్ట్రం లో రిస్క్ 122%. 

ఫాక్ట్ (నిజం): ): కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ రిస్క్ ని లెక్కించడానికి ఉపయోగించిన సూత్రానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. రిస్క్ ని అంచనా వేయడానికి ఉపయోగించిన డేటా ప్రతి ఒక్కరూ ఉపయోగించని ‘ఆరోగ్యసేతు’ అప్లికేషన్ నుండి తీసుకోబడ్డాయి. వాస్తవ డేటా వాడలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

ఫేస్బుక్ పేజ్  ‘India in Pixels’ లో ఇన్ఫోగ్రాఫ్ ని ’22 జూన్ 2020′ న పోస్టు చేసినట్లుగా చూడవచ్చు. వారు ఆ పోస్ట్ ని తరువాత ఎడిట్ చేసి, ఈ విధంగా యాడ్ చేసినట్లుగా చూడవచ్చు – ‘దయచేసి ఈ ఇన్ఫోగ్రాఫిక్ చూసి భయపడవద్దు. ఇది ఒక అంచనా కాదు. అయితే ఆక్టివ్ కేసులతో పోల్చితే కారంటైన్ సంఖ్యను మాత్రమే పోల్చాము. ‘ఆరోగ్యసేతు‘ ఆధారంగా ఢిల్లీ మరియు తెలంగాణా ల్లో ఆ నిష్పత్తి ఎక్కువగా ఉంది. 100 కంటే ఎక్కువ విలువ ఉంటే, కారంటైన్ అయిన వ్యక్తుల కంటే ఎక్కువ ఆక్టివ్ కేసులు ఉన్నాయని అర్థం. అంటే ఆయా రాష్ట్రాలు కారంటైన్ సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. మేము వ్యాప్తిపై ఎటువంటి క్లెయిమ్ చెయ్యడం లేదు – అది జనాభా అనుకరణలపై ఆధారపడి ఉంటుంది. ఆ ఇన్ఫోగ్రాఫ్ ని కాంటెక్స్ట్ లేకుండా షేర్ చేస్తున్నారు మరియు వివిధ వర్గాలకు చెందిన వారు తమ కథనానికి తగ్గట్లుగా దానిని మల్చుకుంటున్నారు’.@indiainpixels’ ఆ విషయం పై ట్విట్టర్ లో ఇచ్చిన స్పష్టతలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

అంచనా కోసం ఉపయోగించిన డేటా కి సంబంధించిన ‘GitHub’ లింక్ ని పోస్ట్‌లో ఇచ్చారు. ఆ డేటా ని చూసినప్పుడు, తెలంగాణా లో రిస్క్ శాతాన్ని లెక్కించడానికి కారంటైన్ అయిన వ్యక్తుల సంఖ్యను సుమారు 3000 మంది అని తీసుకున్నట్లుగా చూడవచ్చు. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ప్రెస్ నోట్‌ లో, ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్లలో ఉన్న వారి సంఖ్య 1,99,465 అని ఉంది, అంటే వారంతా కారంటైన్ లో ఉన్నట్టే లెక్క. అంటే లెక్కింపు కోసం ఉపయోగించిన సంఖ్య కంటే అది 60 రెట్లు ఎక్కువ. 

Press Note

కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ రిస్క్ ని లెక్కించడానికి ఉపయోగించిన సూత్రానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఏ అంతర్జాతీయ సంస్థ గాని, ప్రభుత్వం గాని రిస్క్ కోసం ఇటువంటి ఫార్ములా వాడలేదు. ఒకవేళ ఆ ఫార్ములానే ఒక మెట్రిక్ గా తీసుకుని, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ రిస్క్ ని తెలంగాణా ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ఆధారంగా లెక్కించిన్నప్పుడు, రాష్ట్రం లో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ రిస్క్ సుమారు 2.2% అని వస్తుంది ( 22 జూన్ 2020 డేటా ప్రకారం), 122% కాదు.

చివరగా, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ రిస్క్ ని లెక్కించడానికి ఉపయోగించిన సూత్రానికి శాస్త్రీయ ఆధారాలు లేవు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll